తెలుగులోకి.. తమిళ, మలయాళ ఇండస్ట్రీలను షేక్ చేస్తోన్న సినిమా! కథ.. అది సృష్టిస్తున్న సునామీ ఇదే
ABN, Publish Date - Mar 04 , 2024 | 11:47 AM
ఇటీవల మలయాళంలో విడుదలై సంచలన విజయం సాధించి రికార్డుల మీద రికార్డులు తిరగ రాస్తున్నచిత్రం మంజుమ్మెల్ బాయ్స్. అంతా కొత్త వారితో రియల్ ఇన్సిడెంట్ అధారంగా తెరకెక్కిన ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తోంది.
ఇటీవల మలయాళం (Malayalam) లో విడుదలై సంచలన విజయం సాధించి రికార్డుల మీద రికార్డులు తిరగ రాస్తున్నచిత్రం మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys). ఒకరిద్దరు మినహ దాదాపు అంతా కొత్త వారితో రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్ అధారంగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్ సాజిటివ్ టాక్‌తో కేరళలో ఇంతవరకు ఏ పెద్ద స్టార్ చూడలేని విజయాన్ని, ఏ చిత్రానికి సాధ్యపడని వసూళ్లను రాబడుతూ మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తోంది.
ఇదిలాఉండగా.. ఈ మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys) సినిమా డైరెక్ట్ మలయాళ (Malayalam) వెర్షన్‌ను తమిళనాడులో విడుదల చేయగా అక్కడా భాషతో సంబంధం లేకుండా జనం విరగపడి చూడడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే కేరళలో కన్నా తమిళనాటే అంతకుమించి అనేలా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకెళుతోంది. ఈ రోజుకు కేవలం తమిళనాడులోనే 11 రోజుల్లో దాదాపు 221 థియేటర్లలో హౌజ్‌ఫుల్ గా నడుస్తూ.. ఈ చిత్రం రూ.15 కోట్లు వసూళ్లు సాధించిందంటే ఈ సినిమాకు అక్కడి ప్రజలు ఎలా బ్రహ్మరథం పడుతున్నారంటే ఇట్టే అర్థమవుతోంది.
కథ విషయానికి వస్తే.. కేరళలో ని మంజుమ్మెల్ (Manjummel) ప్రాంతానికి చెందిన గ్రూప్ ఆఫ్ ప్రెండ్స్ దాదాపు ఓ పది మంది టూర్‌కు వెళ్లి తిరిగి వస్తుంటారు. ఈక్రమంలో కమల్‌హసన్ నటించిన గుణ అనే సినిమా షేటింగ్ జరిగిన ఓ గుహను చూడడం మరిచిపోయామంటూ ఆ గుహ దగ్గరకు వెళతారు. అప్పుడు అనుకోకుండా ఒకతను ఆ గుహాలో పడి పోతాడు. దీంతో అతనిని బయటకి తీసుకురావడానికి ఆ మిత్ర బృందం చేసిన సాహసం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఇంకా చాలా సన్నివేశాలలో గుణ సినిమాలోని కమ్మనీ ఈ ప్రేమను అనే పాటను, కమల్ వాయిస్‌ను బాగా వాడడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది.
ఇప్పుడు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 15న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. అయితే.. ఇప్పటికే మన తెలుగు వాళ్లు కూడా ఈ సినిమాను మలయాళంలోనూ చూస్తు ప్రశంసలు గుప్పిస్తుండడం విశేషం. కామెడీ, ఎమోషన్, సంగీతం, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో ప్రేక్షకుడిని సీట్ ఎట్జ్‌లో కూర్చోబెట్టేలా రూపొందిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. దీంతో ఇప్పుడు తమిళ, మలయాళ సెలబ్రిటీలు ఈ డైరెక్టర్‌ని ఓ రేంజ్‌లో మెచ్చుకుంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.