Mangampeta: ఇంట్రస్టింగ్‌గా ‘మంగంపేట’ ఫస్ట్ లుక్.. గ్లింప్స్ విడుదల

ABN, Publish Date - Sep 06 , 2024 | 04:37 PM

చంద్రహాస్ కే, అంకిత సాహా హీరోహీరోయిన్లుగా భాస్కర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘మంగంపేట’. గౌతం రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి శ్రీహరి చెన్నం, రాజేంద్ర పోరంకి సహ నిర్మాతలుగా.. మానస్ చెరుకూరి, ప్రముఖ్ కొలుపోటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విజువల్ ట్రీట్ గ్లింప్స్‌‌తో వదిలారు.

Mangampeta Movie First Look

చంద్రహాస్ కే, అంకిత సాహా హీరోహీరోయిన్లుగా భాస్కర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘మంగంపేట’ (Mangampeta Movie). గౌతం రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి శ్రీహరి చెన్నం, రాజేంద్ర పోరంకి సహ నిర్మాతలుగా.. మానస్ చెరుకూరి, ప్రముఖ్ కొలుపోటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విజువల్ ట్రీట్ గ్లింప్స్‌‌తో వదిలారు. ఈ గ్లింప్స్ ఎలా ఉందంటే..

Also Read-Pawan Kalyan: రూ. 6 కోట్ల విరాళం.. గొప్ప మనసు చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

‘ఈశ్వర్.. 20 ఏళ్లు అయిందిరా.. ఊరిని చూడాలనిపిస్తుందిరా.. చూపిస్తావా?..’, ‘కొన్ని రోజులు ఆగమ్మా.. ఊరినిండా రాక్షసులే ఉన్నారు.. వాళ్లని చంపి.. ఊరిని చూపిస్తానమ్మా..’, ‘చంపాల్సింది రాక్షసుల్ని కాదు.. రావణుడ్ని..’,‘రాముడు రాలేకపోవచ్చు.. శివుడు శూలాన్ని పంపిస్తే.. చేయాల్సింది యుద్దం కాదు.. శివ తాండవం..’ అనే డైలాగ్స్‌తో పాటు.. చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా కొత్తగా, హైలెట్ అనేలా ఉన్నాయి. హీరో చంద్రహాస్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియెన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ ట్రెండ్ అవుతోంది. (Mangampeta Movie Glimpse Out)


‘మంగంపేట’ టెక్నికల్‌గానూ హై స్టాండర్డ్‌‌లో ఉంది. కెమెరామెన్ ఈ మూవీ కోసం వాడిన కలర్ గ్రేడింగ్, పెట్టిన షాట్స్.. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ఆర్ఆర్ అన్నీ సినిమాపై పాజిటివ్ బజ్‌ని ఏర్పడేలా చేస్తున్నాయి. ఈ మూవీ మాస్ ఆడియెన్స్‌కు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉంటుందని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను ప్రకటించనున్నామని మేకర్స్ తెలియజేశారు. చంద్రహాస్ కే, అంకిత సాహా, నాగ మహేష్, కబీర్ దుహన్ సింగ్, కాలకేయ ప్రభాకర్, దయానంద్ రెడ్డి, ఎస్టర్ నోరోన్హా, పృధ్వీరాజ్, అడుకాలం నరేన్, సమ్మెట గాంధీ, 14 రీల్స్ నాని, ఈశ్వర్ రాజనాల, సమీర్, దొరబాబు తదితరులు ఈ చిత్రంలోని తారాగణం.

Read Latest Cinema News

Updated Date - Sep 06 , 2024 | 04:37 PM