మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Manchu Manoj: రామ్ చరణ్‌కి అర్థరాత్రి కాల్ చేశా.. క్షణంలో రూ. 5 లక్షలు పంపాడు

ABN, Publish Date - Mar 28 , 2024 | 05:48 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును హైదరాబాద్‌లో ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ఎందరో సెలబ్రిటీలు హాజరై, రామ్ చరణ్ గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు. ఈ వేడుకకు మంచు హీరో మంచు మనోజ్ గెస్ట్‌గా హాజరై మెగాభిమానులను సంతోషంలో ముంచెత్తారు. తన లైఫ్‌లో జరిగిన ఓ సంఘటనని మంచు మనోజ్ ఈ వేడుకలో తెలియజేసి మెగాభిమానులను ఖుషి చేశారు.

Manchu Manoj and Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) పుట్టినరోజును హైదరాబాద్‌లో ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ఎందరో సెలబ్రిటీలు హాజరై, రామ్ చరణ్ (Ram Charan) గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు. ఈ వేడుకకు మంచు హీరో మంచు మనోజ్ (Manchu Manoj) గెస్ట్‌గా హాజరై మెగాభిమానులను సంతోషంలో ముంచెత్తారు. అంతేకాదు, తన ఫ్రెండ్ రామ్ చరణ్ గొప్పతనం (Ram Charan Greatness) గురించి మంచు మనోజ్ చెబుతుంటే.. శిల్పకళా వేదిక హోరెత్తింది. ఇంతకీ మంచు మనోజ్ ఏం చెప్పారంటే..

‘‘రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్. నా ఫ్రెండ్ గురించి మీకో విషయం చెప్పాలి. మనిషి ఎదిగే కొద్ది కొత్త కొత్త స్నేహితులు యాడ్ అవుతుంటారు. కానీ చరణ్.. తన చిన్నప్పటి నుండి తనతో ఉన్న స్నేహితులందరినీ గుర్తు పెట్టుకుని మరీ కలుస్తుంటాడు. ఇప్పటికీ వారితో టచ్‌లోనే ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం. అతను గొప్ప నటుడే కాదు.. చాలా గొప్ప మానవత్వం ఉన్న మనిషి కూడా. చరణ్‌ది ఎంత గొప్ప మనసంటే.. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే సాయం చేస్తాడు. నిజంగా రామ్ చరణ్ వంటి వారు చాలా అరుదుగా ఉంటారు. (Manchu Manoj about Ram Charan)


ఓసారి ఏం జరిగిందంటే.. నేను అప్పుడు యుఎస్‌లో ఉన్నా. అప్పుడు దుబాయ్‌లో ఓ తెలుగు ఫ్యామిలీ బాగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వారికి ఓ చిన్న పాప కూడా ఉంది. ఆ సమయంలో నేను చేయగలిగినంత సాయం చేసినా.. సరిపోలేదు. ఇంకో రూ. 5 లక్షలు కావాల్సి వచ్చింది. అప్పుడు ఎవరికి ఫోన్ చేయాలా? అని ఆలోచిస్తే వెంటనే నాకు చరణ్ గుర్తొచ్చాడు. అర్థరాత్రి ఫోన్ చేసి.. మిత్రమా.. అంటూ విషయం చెప్పా. అకౌంట్ నెంబర్ పెట్టు బాబాయ్ అని ఒక్క సెకన్‌లో అమౌంట్ పంపించాడు. నిజంగా చరణ్‌కి ఆ పాప ఆశీస్సులు, పాప తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. నీకు ఏ కష్టం రాకుండా.. ఇంకా.. వరల్డ్ మ్యాప్‌లో నెంబర్ వన్ స్టార్‌గా గుర్తింపును పొందాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. (Manchu Manoj Speech)


ఇవి కూడా చదవండి:

====================

*Siddharth and Aditi Rao Hydari: అదితి రావు క్లారిటీ ఇచ్చేసింది

********************

*Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్..

***************************

*Anasuya: నాకు పార్టీ కాదు.. లీడర్ ముఖ్యం.. పవన్ కళ్యాణ్‌ పిలిస్తే ప్రచారం చేస్తా!

************************

Updated Date - Mar 28 , 2024 | 05:48 PM