ఏడు గెటప్పుల్లో మంచు లక్ష్మి
ABN, Publish Date - Mar 20 , 2024 | 06:07 AM
లక్ష్మీ మంచు ప్రధాన పాత్ర పోషించిన సోషియో ఫాంటసీ ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎస్.కే నిర్మాత. ఈ పీరియాడిక్ డ్రామా తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదలవుతోంది...
లక్ష్మీ మంచు ప్రధాన పాత్ర పోషించిన సోషియో ఫాంటసీ ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎస్.కే నిర్మాత. ఈ పీరియాడిక్ డ్రామా తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదలవుతోంది. తెలంగాణ ఎఫ్.డి.సి ఛైర్మన్ ఎన్. గిరిధర్ చేతుల మీదుగా ‘ఆదిపర్వం’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ మంచు మాట్లాడుతూ ‘పోస్టర్ చూస్తుంటే ‘నేను ఇన్ని పాత్రలు చేశానా?’ అనిపిస్తోంది. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది’ అన్నారు. ‘ఈ చిత్రానికి బలం, బలగం మంచు లక్ష్మి. ఆమె నటించకపోతే ఈ సినిమా లేదు. ఇందులో ఆమె ఏడు రకాల గెటప్స్ వేశారు. తన నట విశ్వరూపం చూస్తాం’ అని దర్శకుడు చెప్పారు. శివ కంఠంనేని, ఎస్తర్ నోరోనా కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మాధవ్, సంజీవ్. సినిమాటోగ్రఫీ: ఎస్‌ఎన్ హరీశ్