Malvi Malhotra: లావణ్య నన్ను కూడా బెదిరిస్తోంది.. పరువు నష్టం దావా వేస్తా!

ABN, Publish Date - Jul 06 , 2024 | 05:04 PM

హీరో రాజ్‌తరుణ్‌ (Raj tarun), మాల్వీ మల్హోత్ర (Malvi Malhotra) డేటింగ్‌లో ఉన్నారంటూ లావణ్య  చేసిన వ్యాఖ్యలను హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఖండించారు.

Malvi Malhotra

హీరో రాజ్‌తరుణ్‌ (Raj tarun), మాల్వీ మల్హోత్ర (Malvi malhotra) డేటింగ్‌లో ఉన్నారంటూ లావణ్య  చేసిన వ్యాఖ్యలను హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఖండించారు. లావణ్య తన మీద చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి'తో చెప్పారు. రాజ్‌తరుణ్‌ హీరోగా తెరకెక్కిన 'తిరగబడరసామీ’ చిత్రంలో ఆమె కథానాయికగా నటించారు. రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రతో సన్నిహితంగా ఉంటున్నాడంటూ రాజ్ తరుణ్ గత ప్రేయసి లావణ్య శుక్రవారం వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అతని మీద కేసు కూడా పెట్టింది. లావణ్యపై ఫైర్ అవుతూ.. సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై మాల్వీ మల్హోత్ర కంప్లయింట్ చేశారు. 


ఈ మేరకు మాల్వీ మల్హోత్ర మాట్లాడుతూ.. ‘‘నేను బెదిరించానని లావణ్య చెబుతుంది. ఆమెను నేను బెదిరించడం కాదు.. నన్నే ఆమె బెదిరించింది. నా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి లేనిపోనివి చెప్పింది. రాజ్‌ తరుణ్‌తో నా ఫోటోలన్నీ మేం కలిసి నటించిన సినిమాకు సంబంధించినవే. నాపై ఆరోపణలు చేసిన లావణ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తనపై పరువు నష్టం దావా వేస్తాను’’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - Jul 06 , 2024 | 05:15 PM