పెద్ద సినిమాలు తీస్తా

ABN, Publish Date - Nov 27 , 2024 | 06:19 AM

‘‘రోటీ కపడా రొమాన్స్‌’ దర్శకుడిగా నాకు తొలి చిత్రం. ఇది హిట్‌ చేసి దర్శకుడిగా నిలబడే ఛాన్స్‌ ఇస్తే నేను కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి భారీ సినిమాలు తీస్తా. అలాంటి కథలు నా దగ్గర ఉన్నాయి’ అన్నారు...

‘‘రోటీ కపడా రొమాన్స్‌’ దర్శకుడిగా నాకు తొలి చిత్రం. ఇది హిట్‌ చేసి దర్శకుడిగా నిలబడే ఛాన్స్‌ ఇస్తే నేను కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి భారీ సినిమాలు తీస్తా. అలాంటి కథలు నా దగ్గర ఉన్నాయి’ అన్నారు దర్శకుడు విక్రమ్‌ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన ‘రోటీ కపడా రొమాన్స్‌’ చిత్రం ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ‘ఇదొక యూత్‌పుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. కామెడీ, ఫ్రెండ్‌షిప్‌ నేపథ్యంలో ఉంటుంది. సినిమాలో నాలుగు ప్రేమకథలు ఉంటాయి. నలుగురు యువకుల జీవితాల్లోకి నలుగురు యువతులు వచ్చాక వారి జీవితాలు ఎలా మారిపోతాయో చెప్పే సినిమా ఇది. చివరి పదిహేను నిముషాలు అందరి హృదయాలను హత్తుకుంటాయి’ అని చెప్పారు విక్రమ్‌రెడ్డి.

Updated Date - Nov 27 , 2024 | 06:19 AM