ముఫాసాకు మహేశ్ వాయిస్
ABN, Publish Date - Aug 22 , 2024 | 12:15 AM
ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్న ‘ది లయన్ కింగ్’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. ‘ముఫాసా ది లయన్ కింగ్’ పేరుతో వస్తున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో ముఫాసాకు
ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్న ‘ది లయన్ కింగ్’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. ‘ముఫాసా ది లయన్ కింగ్’ పేరుతో వస్తున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో ముఫాసాకు మహేశ్‌బాబు వాయిస్ అందిస్తుండడం ఆసక్తికరం. ఈ సినిమా హిందీ వెర్షన్‌కు షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. తెలుగు వెర్షన్‌లో పుంబా పాత్రకు బ్రహ్మానందం, టిమోన్ పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పారు. తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ ‘డిస్నీతో అనుబంధం నాకు ప్రత్యేకమైంది. తన కొడుకు అంటే అభిమానం కలిగిన పాత్ర ముఫాసా. అంతేకాదు అడవికి రారాజు. ఆ పాత్రకు నేను వాయిస్ అందించడం నా పిల్లలతో ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే సందర్భం ఇది’ అన్నారు. డిసెంబర్ 24న ‘ముఫాసా ది లయన్ కింగ్’ విడుదలవుతుంది.