మహేశ్‌బాబు కొత్త లుక్‌లో

ABN, Publish Date - Aug 12 , 2024 | 03:12 AM

క్లాస్‌ లుక్‌లో సింపుల్‌గా చిరునవ్వుతో కనిపించే మహేశ్‌బాబు ఈసారి సరికొత్త లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు...

క్లాస్‌ లుక్‌లో సింపుల్‌గా చిరునవ్వుతో కనిపించే మహేశ్‌బాబు ఈసారి సరికొత్త లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆయన పోనీటెయిల్‌, గుబురుగడ్డంతో ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. రాజమౌళితో చేస్తున్న చిత్రం కోసమే మహేశ్‌ ఈ కొత్తలుక్‌లోకి మారారని టాక్‌. ఇటీవలే మహేశ్‌బాబు తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో కలసి విహార యాత్రకు రాజస్థాన్‌లోని జైపూర్‌ వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు జైపూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త లుక్‌లో కనిపించారు.

Updated Date - Aug 12 , 2024 | 03:12 AM