M4M: ఫస్ట్ డే సినిమా చూసిన వారికి రూ. లక్ష గెలుచుకునే అవకాశం
ABN, Publish Date - Nov 30 , 2024 | 08:21 PM
దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల తను దర్శకత్వం వహించిన M4M మూవీ విశేషాలను తెలుపుతూ.. అందరికీ ఓ ఛాలెంజ్ విసిరారు. ఈ సినిమా మొదటి రోజు చూసి.. ఇందులో కిల్లర్ ఎవరో గెస్ చేస్తే.. వారికి రూ. లక్ష బహుమతిగా ఇస్తామని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
M4M మూవీ విడుదలైన ఫస్ట్ డే సినిమా చూసి, ఇందులో కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు చిత్ర దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల. జో శర్మ (యూఎస్ఏ) హీరోయిన్‌గా దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘ఎంఫోర్ఎం’ (M4M - Motive For Murder). ఈ మూవీ ప్రస్తుతం విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా మూవీ మీడియా సమావేశాన్ని నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. 110 ఏళ్ల సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరూ తీసుకోని కాన్సెప్టుతో ఈ సినిమా చేసినట్టు చెప్పుకొచ్చారు. రాబోయే పదేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Also Read-Allu Arjun: ఆర్మీ తెచ్చిన తంట.. అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఇంకా ఆయన మాట్లాడుతూ.. రీసెంట్‌గా ‘ఎంఫోర్ఎం’ మూవీ హిందీ ట్రైలర్‌ను ప్రతిష్టాత్మక గోవా ఫిలిం ఫెస్టివల్‌లో ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) ఆధ్వర్యంలో విడుదల చేశాం. ఈ ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ఎక్సలెంట్ టీంతో ఎంతో అద్భుతంగా ఈ సినిమాను పూర్తి చేశాం. హీరోయిన్ జో శర్మ తన ఫర్మార్మెన్స్‌తో సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. కథ, కథనాలను నమ్మి హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సందర్భంగా అందరికీ ఓ ఛాలెంజ్ కూడా విసురుతున్నాను. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే.. ఈ సినిమా చూసి ఇందులో కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కొక్కరికి రూ. లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానని తెలిపారు.
హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ.. నేను ముందుగా మా దర్శకుడు మోహన్ వడ్లపట్లకు బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు గాడ్‌ఫాదర్ ఆయన. నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం అమెరికా నుంచి హైదరాబాద్‌కు ఈ ఏడాదే ఆరు సార్లు వచ్చాను. నేను ఇందులో ఇన్విస్టిగేటివ్ జర్నలిస్టుగా చేశాను. క్షణక్షణం ఉత్కంఠతో నడిచే ఈ సినిమా.. చూస్తున్నంత సేపు ఊపిరి బిగబెట్టేలా ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన వాళ్లందరి ఫీలింగ్ ఇదే. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం ఉందని అన్నారు. కాగా.. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను త్వరలోనే 5 భాషల్లో విడుదల చేయనున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఈ సందర్భంగా యూనిట్ తెలిపింది.
Also Read- Allu Arjun: నన్ను స్టార్‌ను చేసింది ఆయనే..
Also Read-Chai Sobhita: డోల్ డోల్ డోల్ భాజే.. అక్కినేని ఇంట్లో సంబరాలే
Also Read-Prashanth Varma: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. గెట్ రెడీ ఫర్ 'మోక్షజ్ఞ'
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి