ఒక్కసారి ప్రేమిస్తే చాలు

ABN, Publish Date - Dec 09 , 2024 | 03:16 AM

బాలీవుడ్‌ సీనియర్‌ నటి రేఖ రీసెంట్‌గా ఓ రియాల్టీ షోలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. తన కెరీర్‌, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక అంశాలను పంచుకున్నారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రేమలో...

బాలీవుడ్‌ సీనియర్‌ నటి రేఖ రీసెంట్‌గా ఓ రియాల్టీ షోలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. తన కెరీర్‌, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక అంశాలను పంచుకున్నారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రేమలో పడతారని కవులు తమ రచనల్లో రాస్తే...మరికొందరు మాత్రం ప్రేమకు ఆది, అంతం లేదంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని యాంకర్‌ రేఖను ప్రశ్నించగా..‘నా మటుకు, ఆ వ్యక్తి సరైన వాడైతే... ఒక్కసారి ప్రేమిస్తే చాలు’ అని బదులిచ్చారు. మరో ప్రశ్నకు సమాధానంగా నిజమైన ప్రేమకు నిర్వచనం చెబుతూ ‘ఎవరినైనా ప్రేమించండి, నా వరకైతే నేను మొదట అన్నిటినీ ప్రేమిస్తాను. నా వృత్తిని, నా స్నేహితులను, ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని ఇలా...ప్రతీదాన్ని ప్రేమిస్తాను. కానీ, నన్ను నేను ఎక్కువగా ప్రేమిస్తా’ అని చెప్పుకొచ్చారు. రేఖ మాటలు విన్న ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపించారు.

Updated Date - Dec 09 , 2024 | 03:16 AM