మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Dil Raju: ‘లవ్ మీ’ కథ వినగానే.. ‘ఆర్య’కు ఎలా ఎగ్జైట్ అయ్యానో.. అలా ఎగ్జైట్ అయ్యా..

ABN, Publish Date - Feb 27 , 2024 | 06:03 PM

యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన సినిమా ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్రకటన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సినిమాకు ‘లవ్ మీ’ అనే టైటిల్‌ ఫిక్స్ చేస్తూ.. మేకర్స్ గ్లింప్స్‌ని విడుదల చేశారు.

Love Me Title Glimpse Launch

యంగ్ హీరో ఆశిష్ (Ashish), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోహీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ (Dil Raju Productions) బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన సినిమా ‘లవ్ మీ’ (Love Me). ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు (Arun Bhimavarapu) దర్శకత్వాన్ని వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్రకటన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సినిమాకు ‘లవ్ మీ’ అనే టైటిల్‌ ఫిక్స్ చేస్తూ.. మేకర్స్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ‘ఇఫ్ యూ డేర్’ (If You Dare) అనేది ఉప శీర్షిక. టైటిల్ ప్రకటించిన అనంతరం చిత్రయూనిట్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. (Dil Raju Speech) ‘‘ఆశిష్ ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు. అందుకే ఈ వేడుకకు రాలేకపోయారు. ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ అనేది మొదలవ్వడానికి నాగ, అరుణ్ కారణం. నాగ నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఓ స్క్రిప్ట్ వినండి.. నా ఫ్రెండ్‌తో కలిసి చేశామని అన్నాడు. అప్పుడు అరుణ్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఆ స్క్రిప్ట్ విన్న క్షణమే ఓ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లా. ఆర్య కథ విన్నప్పుడు ఎలా ఎగ్జైట్ అయ్యానో.. మళ్లీ అలా ఎగ్జైట్ అయ్యాను. ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్. ఆశిష్ హీరోగా కావాలని అడిగారు. అలానే హర్షిత్, హన్షిత్‌ను ఇవ్వండని నాగ అడిగారు. కథ చెప్పి నన్ను గెలిచారు. కొత్త వాళ్లతో ‘బలగం’ తీశాం. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయాలని దిల్ రాజు ప్రొడక్షన్స్ పెట్టాం. ఈ కథను చాలా మందికి చెప్పాం. అందరూ ఎగ్జైట్ అయ్యారు. స్క్రిప్ట్ పూర్తయ్యాక.. టెక్నీషియన్స్ పేర్లు చెబితే భయం వేసింది. పీసీ శ్రీరామ్ (PC Sreeram) గారికి స్క్రిప్ట్ వినమని చెప్పాను. ఆయన స్క్రిప్ట్ చదివి వెంటనే ఓకే చెప్పారు. మ్యూజిక్ విషయంలో కీరవాణి (MM Keeravani) కావాలన్నారు. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటివి చేస్తున్నారు.. ఆయన మీకు దొరుకుతాడా? అని అన్నారు. కీరవాణి గారిని అప్రోచ్ అయి స్క్రిప్ట్ వినిపించారు. ఆయన కూడా స్క్రిప్ట్ విని వెంటనే ఓకే చెప్పారు. హీరోయిన్ కోసం వెతుకుతున్న టైంలో ‘బేబీ’ (Baby) పెద్ద హిట్ అయింది. ఆఫీస్‌కు వచ్చి స్క్రిప్ట్ పూర్తిగా చదివి ఫుల్ ఎగ్జైట్ అయింది. ఇలా ఓ స్క్రిప్ట్ ఈ రేంజ్‌లో ఎగ్జైట్ చేయించడం చాలా అరుదుగా చూస్తాం. ఇక సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంటుందని నాకు నమ్మకంగా ఉంది. ఫిబ్రవరి 27న టైటిల్ ప్రకటించాం. ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయబోతోన్నాం. ‘బలగం’ (Balagam) తరువాత హర్షిత్, హన్షితలు వేరే ప్రాజెక్ట్ చేయాల్సింది ఈ సినిమా వచ్చింది. ఆశిష్ కూడా వేరే ప్రాజెక్ట్ చేయాల్సింది.. ఈ ప్రాజెక్ట్ రెడీ అయింది. నాకు ‘ఆర్య’ విషయంలో ఏం జరిగిందో.. ఈ చిత్ర నిర్మాతలందరికీ అదే జరగబోతోందనే వైబ్స్ వస్తున్నాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.


వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) మాట్లాడుతూ.. ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ కథ విన్నప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఆ వైబ్స్ వస్తుంటాయి. అదే ఎగ్జైట్మెంట్ ఇప్పటికీ ఉంది. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకం. ఇలాంటి పాయింట్, లైన్‌ను ఇది వరకెప్పుడూ చూడలేదు. త్వరలోనే టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. టీజర్ అందరికీ డిఫరెంట్ వైబ్‌ను కలిగిస్తుంది. థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌తో వస్తారని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Ester Noronha: 10 సంవత్సరాల క్రితం మొదటి హిట్, అసలు విషయం చెప్పేసిన ఎస్తర్..

********************************

*Mahesh Babu: మల్టీప్లెక్స్‎ల బాట పట్టిన సూపర్ స్లార్లు.. ఏకంగా అక్కడ థియేటర్ ఓపెన్ చేస్తోన్న మహేశ్ బాబు

**************************

*Anjali: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. నాకెంతో స్పెషల్ ఫిల్మ్

******************************

Updated Date - Feb 27 , 2024 | 06:03 PM