Coolie: కింగ్ నాగ్ సీన్ లీక్‌పై లోకేష్ కనగరాజ్ స్పందనిదే..

ABN, Publish Date - Sep 18 , 2024 | 09:05 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్‌’ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం తన LCU నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో అదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా కింగ్ నాగార్జునకు సంబంధించిన ఓ వీడియోలో లీక్ కావడంతో లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.

Lokesh Kanagaraj and King Nagarjuna

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) ‘జైలర్‌’ (Jailer) బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం తన LCU నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో అదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ (Coolie) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే కింగ్ నాగార్జున షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అవడంతో.. ఒక్కసారిగా యూనిట్ అలెర్ట్ అయింది. సోషల్ మీడియా వేదికగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) రియాక్ట్ అవుతూ.. అలాంటి లీక్స్ చేయవద్దని వేడుకున్నారు.

Also Read- Jani Master: జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు.. మ్యాటర్ సీరియస్

‘ఒక్క లీక్‌తో రెండు నెలలుగా ఎంతో మంది పడిన కష్టం అంతా వృధా అయింది. దయచేసి ఎవరూ లీక్ సీన్‌ని ప్రోత్సహించవద్దని కోరుతున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘కూలీ’ సినిమాలో సైమన్‌గా కింగ్ నాగార్జున కనిపించనున్నారు. ఓ భారీ ఫైట్ సీన్‌కు సంబంధించిన వీడియోని సెట్‌లోని వారు లీక్ చేశారు. ఆ విషయం ఆ లీక్డ్ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. గుంపులో నుంచి వీడియోని ఫోన్‌తో షూట్ చేసినట్లుగా తెలియడంతో.. లోకేష్ కనగరాజ్ టీమ్‌పై కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది.


‘కూలీ’ విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఇది 171వ మూవీ. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, మహేంద్రన్ వంటి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరింత స్టార్ పవర్‌ను ఈ సినిమాకు జోడించడానికి, మేకర్స్ కింగ్ నాగార్జునను ఓ ప్రత్యేక పాత్రకు సెలక్ట్ చేశారు. కింగ్ నాగార్జున (King Nagarjuna) బర్త్‌డే స్పెషల్‌గా ఇటీవల ఆయన పాత్రను సైమన్‌గా పరిచయం చేశారు. నాగ్ ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకుంది. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా 2025లో విడుదల కానుంది.

Also Read- Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

Read Latest Cinema News

Updated Date - Sep 18 , 2024 | 09:05 PM