సినిమా చెట్టును తిరిగి బతికిస్తాం!
ABN, Publish Date - Aug 07 , 2024 | 01:03 AM
సినిమా చెట్టును శాస్త్రీయ పద్ధతిలో తిరిగి బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తూర్పుగోదావరి జిల్లా డీఎ్‌ఫవో బి.నాగరాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో...
సినిమా చెట్టును శాస్త్రీయ పద్ధతిలో తిరిగి బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తూర్పుగోదావరి జిల్లా డీఎ్‌ఫవో బి.నాగరాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో గోదావరి ఒడ్డున ఉన్న సినిమా చెట్టు సోమవారం తెల్లవారుజామున పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ చెట్టు కూలిపోయిందనే విషయం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో రోజంతా ఇదే విషయం హాట్ టాపిక్‌గా మారింది. కాగా అమరావతి నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం డీఎ్‌ఫవో బి.నాగరాజు, డీఆర్‌వో వేణుగోపాల్, ఎఫ్‌బీవో ఎం.కార్తీక్ ఈ సినిమా చెట్టును పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎ్‌ఫవో నాగరాజు మాట్లాడుతూ పడిపోయిన చెట్టును సైంటిఫిక్‌గా తిరిగి బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆంధ్రజ్యోతి (కొవ్వూరు)