Izzat : ఆడపిల్ల తిరగబడితే...

ABN, Publish Date - Jul 06 , 2024 | 05:28 AM

నటి లావణ్య ప్రధాన పాత్ర పోషిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఇజ్జత్‌’. పరువు హత్యల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ఉపేంద్ర ఎస్‌పీ దర్శకత్వంలో శ్రీను కందుల నిర్మిస్తున్నారు. శుక్రవారం దర్శకుడు సునీల్‌కుమార్‌ రెడ్డి ‘ఇజ్జత్‌’ టైటిల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

నటి లావణ్య ప్రధాన పాత్ర పోషిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఇజ్జత్‌’. పరువు హత్యల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ఉపేంద్ర ఎస్‌పీ దర్శకత్వంలో శ్రీను కందుల నిర్మిస్తున్నారు. శుక్రవారం దర్శకుడు సునీల్‌కుమార్‌ రెడ్డి ‘ఇజ్జత్‌’ టైటిల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ ‘ఒక మధ్య తరగతి అమ్మాయి కథే ‘ఇజ్జత్‌’ చిత్రం. పరువు హత్యకు సిద్ధపడిన తల్లీతండ్రులకు ఎదురు తిరిగే ధైర్యవంతురాలిగా కథానాయిక కనిపిస్తుంది. ఒక ఆడ పిల్ల తిరగబడితే ఎలా ఉంటుందో చెప్పే చిత్రమే మా ‘ఇజ్జత్‌’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘గతంలో పరువు హత్యల మీద వచ్చిన చిత్రాలకు ‘ఇజ్జత్‌’ భిన్నంగా ఉంటుంది. కొత్త తరహా కథనంతో క్వాలిటీ విజువల్స్‌తో నిర్మిస్తున్నాం. ఫస్ట్‌ కాపీ సిద్ధమవుతోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్‌ బొబ్బిలి. సినిమాటోగ్రఫీ: వీఆర్‌కే నాయుడు.

Updated Date - Jul 06 , 2024 | 05:28 AM