చిత్రకు లతా మంగేష్కర్‌ అవార్డు

ABN, Publish Date - Aug 21 , 2024 | 01:41 AM

ప్రఖ్యాత నేపథ్య గాయకురాలు కె.ఎస్‌.చిత్ర, సంగీత దర్శకుడు ఉత్తమ్‌ సింగ్‌లను దివంగత గాయని లతా మంగేష్కర్‌ స్మారక పురస్కారాలు వరించాయి. మధ్యప్రదేశ్‌లో సెప్టెంబరు 28న ఈ అవార్డులను...

ప్రఖ్యాత నేపథ్య గాయకురాలు కె.ఎస్‌.చిత్ర, సంగీత దర్శకుడు ఉత్తమ్‌ సింగ్‌లను దివంగత గాయని లతా మంగేష్కర్‌ స్మారక పురస్కారాలు వరించాయి. మధ్యప్రదేశ్‌లో సెప్టెంబరు 28న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంగళవారం ప్రకటించింది. ప్రతీ ఏటా లతా మంగేష్కర్‌ జయంతి రోజున ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. 2022 సంవత్సరానికి ఉత్తమ్‌ సింగ్‌, 2023 సంవత్సరానికి చిత్ర ఈ అవార్డులు అందుకోనున్నారు. లత స్మారకార్థం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించిన నూతన ఆడిటోరియంలో ఈ అవార్డులను బహూకరిస్తారు.

Updated Date - Aug 21 , 2024 | 01:41 AM