Lambasingi: మెలోడి పాటతో.. రిలీజ్ డేట్
ABN, Publish Date - Mar 07 , 2024 | 08:18 PM
‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్ రాజ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’ అనేది ఉపశీర్షిక. తాజాగా మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.
వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్ రాజ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’ అనేది ఉపశీర్షిక. తాజాగా మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. (Lambasingi Release Date)
ఒక మెలోడీ పాటతో మేకర్స్ విడుదల తేదీని ప్రకటించడం విశేషం. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మొదటిపాట ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ సినిమా నుంచి ‘వయ్యారి గోదారి’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. జవేద్ అలీ ఆలపించిన ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. డిఫరెంట్ మెలోడీగా సాగే ఈ సాంగ్.. మ్యూజిక్ లవర్స్‌ను బాగా ఆకర్షిస్తోంది. కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ ముగించుకున్న ఈ చిత్రాన్ని మార్చి 15న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని, సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. (#Lambasingi)
ఇవి కూడా చదవండి:
====================
*Allu Arjun and Sneha Reddy: 13వ పెళ్లి రోజు.. ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్
****************************
*Devara: తంగం.. జాన్వీ కపూర్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ వైరల్
**************************