ప్రేమికుల కోసం లైలా

ABN, Publish Date - Dec 17 , 2024 | 05:58 AM

విశ్వక్‌ సేన్‌. ఆకాంక్ష శర్మ జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘లైలా’. రామ్‌నారాయణ్‌ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన...

విశ్వక్‌ సేన్‌. ఆకాంక్ష శర్మ జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘లైలా’. రామ్‌నారాయణ్‌ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో విశ్వక్‌ ‘లైలా’ అనే అమ్మాయి లుక్‌లో కనిపించి అందర్నీ సర్‌ప్రైజ్‌ చేశారు. తాజాగా, ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకి అద్భుతమైన సినిమాటిక్‌ అనుభూతిని అందిస్తుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌, సంగీతం: లియోన్‌ జేమ్స్‌.

Updated Date - Dec 17 , 2024 | 05:58 AM