Laggam: ‘లగ్గం’ జరిగే మండపంలో ‘లగ్గం’ ట్రైలర్ విడుదల.. వధూవరులు భావోద్వేగం

ABN, Publish Date - Oct 10 , 2024 | 05:23 PM

ఒక మంచి సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ‘లగ్గం’ చిత్ర దర్శకనిర్మాతలు ప్రమోషన్స్‌లో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. రెగ్యులర్‌గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్, లేక టాప్ ప్రొడ్యూసర్‌లతో టీజర్, ట్రైలర్ వంటి వాటిని రిలీజ్ చేయించడం అనేది చూస్తూనే ఉంటాం. కానీ ‘లగ్గం’ టీమ్ ఏం చేశారో తెలుసా..

Laggam Trailer Launch

ఒక మంచి సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ‘లగ్గం’ చిత్ర దర్శకనిర్మాతలు ప్రమోషన్స్‌లో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. రెగ్యులర్‌గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్, లేక టాప్ ప్రొడ్యూసర్‌లతో టీజర్, ట్రైలర్ వంటి వాటిని రిలీజ్ చేయించడం అనేది చూస్తూనే ఉంటాం. కానీ, ‘లగ్గం’ టీమ్ మాత్రం ఎవరూ చేయని విధంగా తమ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది. సినిమా మొదలుకొని పాటలు, పోస్టర్స్, టీజర్ అంటూ వరుసగా రోజు ప్రేక్షకులను పలకరిస్తూ ‘రీల్ పెట్టు - చీరపట్టు’ అనే డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో ప్రమోషన్స్ మొదలుపెట్టి సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు. ఒక వైపు ‘లగ్గం’ ట్రావెలర్ ఊరూరా తిరుగుతూ ‘లగ్గం గిఫ్ట్స్’ అందిస్తూ అందరికీ చేరువ అవుతోంది. అదే తరహాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం మరో కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది టీమ్.

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

‘లగ్గం’ సినిమా ట్రైలర్‌ని ఒరిజినల్‌గా ‘లగ్గం’ చేసుకుంటున్న నూతన వధూవరులతో లాంచ్ చేయించింది చిత్ర టీమ్. ఇంజాపూర్ SPR శ్రీరస్తు కన్వెన్షన్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో ‘లగ్గం’ సినిమా టీమ్ అంతా పాల్గొని.. మండపంలోనే వధూవరులైన అనూష, గోవర్ధన్‌ల చేత ‘లగ్గం’ సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేసింది చిత్రయూనిట్. ‘లగ్గం’ టీమ్ ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్‌కి ఆ లగ్గానికి వచ్చిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్య పోవడమే కాక వెరైటీ సినిమా ప్రమోషన్ చూసి అభినందించారు. ఇది లైఫ్ లాంగ్ మాకు గుర్తుండి పోయే ‘లగ్గం’ అని వధూవరులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో సినిమా దర్శకుడు రమేష్ చెప్పాల, చిత్ర నిర్మాత సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి, ఇంకా ఇతర చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.


సాయి రోనక్, ప్రజ్ఞ నగ్ర, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా.. మణిశర్మ నేపధ్య సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ను నూతన వధూవరులు విడుదల చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read- Prabhas: ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. ఎప్పుడంటే

Also Read- Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లో స్మోక్‌ చేస్తూ దొరికిన విష్ణుప్రియ‌.. వైర‌ల్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 10 , 2024 | 05:23 PM