అక్టోబర్‌లో లగ్గం
ABN, Publish Date - Sep 16 , 2024 | 05:44 AM
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా జంటగా నటించిన చిత్రం ‘లగ్గం’. రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్బీ శ్రీరామ్ కీలకపాత్రలు పోషించారు. రమేశ్ చెప్పాల దర్శకత్వంలో వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు...
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా జంటగా నటించిన చిత్రం ‘లగ్గం’. రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్బీ శ్రీరామ్ కీలకపాత్రలు పోషించారు. రమేశ్ చెప్పాల దర్శకత్వంలో వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు. ‘లగ్గం’ విడుదల తేదీ ఖరారైంది. అక్టోబర్ 18న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఆదివారం తెలిపారు. కుటుంబంతో కలసి చూడదగ్గ చిత్రం ‘లగ్గం’ అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కుటుంబ విలువల గొప్పదనాన్ని ఈ తరానికి తెలియజెప్పే చిత్రమిదని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి