ఐదు భాషల్లో ‘కుంభ’
ABN, Publish Date - Aug 30 , 2024 | 05:52 AM
స్వీయ దర్శకత్వంలో వి.సముద్ర నిర్మించే ‘కుంభ’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. హీరో విజయ్‌రామ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు సముద్ర
స్వీయ దర్శకత్వంలో వి.సముద్ర నిర్మించే ‘కుంభ’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. హీరో విజయ్‌రామ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు సముద్ర సతీమణి విజయలక్ష్మి కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత డీఎస్ రావు తొలి క్లాప్ ఇచ్చారు. తొలి షాట్‌కు చంద్రమహేశ్, దేవిప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘కథలను నమ్ముకుని కొత్త వాళ్లతో ఐదు సినిమాలు తీస్తున్నాను. వాటిల్లో ‘కుంభ’ ఒకటి. ఐదు భాషల్లో ఈ సినిమా తయారవుతుంది’ అని సముద్ర చెప్పారు. విజయ్‌రామ్ హీరోగా, సూరజ్ ఆదిత్య విలన్‌గా నటిస్తున్నారు.