Krithi Shetty: అవకాశం నిజమైతే అదృష్టమే..!

ABN, Publish Date - Jul 06 , 2024 | 12:47 PM

తొలి చిత్రం 'ఉప్పెన’తో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యారు బెంగళూరు బ్యూటీ కృతీశెట్టి (Krithi Shetty). ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడం బేబమ్మ పాత్రకు విపరీతమైన ఆదరణ రావడంతో ఆమె పేరు మార్మోగిపోయింది.

తొలి చిత్రం 'ఉప్పెన’తో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యారు బెంగళూరు బ్యూటీ కృతీశెట్టి (Krithi Shetty). ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడం బేబమ్మ పాత్రకు విపరీతమైన ఆదరణ రావడంతో ఆమె పేరు మార్మోగిపోయింది. అవకాశాలు వరుస కట్టాయి. ‘బంగార్రాజు’, 'శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రాలు బాగానే ఆడాయి. ఆ తరవాత ఆమె ట్రాక్‌ తప్పిపోయింది. 'ద వారియర్‌' నుంచి 'మనమే’ చిత్రం వరకూ నాలుగు సినిమాలు వచ్చాయి. ఏదీ సక్సెస్‌ బాట పట్టలేదు. అన్నీ పరాజయాలే. కృతీ మంచి ఫామ్‌లో ఉంటుందనుకుంటే ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతోంది. తాజాగా మరో అవకాశం ఆమె తలుపు తట్టింది. 

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. రానా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా కృతిని ఎంచుకొన్నట్టు సమాచారం. దుల్కర్‌తో (Dulquer Salmaan) జోడీ కట్టడం కృతికి ఇదే మొదటిసారి అవుతుంది. నిజంగా ఆ అవకాశం ఆమెకు దక్కితే కృతీ అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే  సెల్వరాజ్‌ (Selvaraj) తన కథానాయికల పాత్రల్ని అందంగా, అర్థవంతంగా తీర్చిదిద్దుతాడు.  దుల్కర్‌కు పాన్  ఇండియా మార్కెట్‌ ఉంది. కాబట్టి అన్ని భాషల్లో అతని సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. సినిమా హిట్టయితే అన్ని పాన్  ఇండియా స్థాయిలో కృతీకి గుర్తింపు వస్తుంది. ప్రస్తుతం దుల్కర్‌ హీరోగా రూపొందుతున్న ‘లక్కీ భాస్కర్‌’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తర్వాతే సెల్వరాజ్‌ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. కృతీశెట్టి   మలయాళంలో ఓ సినిమా, తమిళంలో మూడు చిత్రాలతో బిజీగా ఉంది.


Updated Date - Jul 06 , 2024 | 12:51 PM