Koratala Siva: నిన్న రాత్రి నుండి ఫోన్ కాల్స్ వ‌స్తూనే ఉన్నాయ్..

ABN, Publish Date - Sep 27 , 2024 | 08:04 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన‌ ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిజల్ట్‌పై చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో..

Koratala Siva and Kalyan Ram

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’ (Devara). కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన‌ ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్‌ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డే ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర యూనిట్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌ను నిర్వ‌హించారు.

Also Read- Devara Review: ‘దేవర’ మూవీ రివ్యూ

ఈ కార్య‌క్ర‌మంలలో చిత్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ (Koratala Siva) మాట్లాడుతూ.. ‘‘ఇంత పెద్ద విజ‌యాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. మూడేళ్ల క‌ష్ట‌మే దేవ‌ర సినిమా. నిన్న రాత్రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఫోన్ కాల్స్ వ‌స్తూనే ఉన్నాయి. నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అంటున్నారు. ఈ అవ‌కాశం ఇచ్చిన ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్‌గారికి ధన్యవాదాలు. అలాగే నా సినిమాలో నటించిన న‌టీన‌టులు, పనిచేసిన సాంకేతిక నిపుణుల‌కు స్పెష‌ల్ థాంక్స్‌. జాన్వీ, శ్రీకాంత్, సైఫ్ అలీఖాన్‌, ర‌త్న‌వేలు, సాబు సిరిల్, అనిరుధ్ స‌హా అంద‌రూ త‌మ సినిమాగా భావించి చివరి నిమిషం వ‌ర‌కు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అందుకే సినిమాకు ఇంత మంచి స‌క్సెస్ ద‌క్కింది. ఈ జ‌ర్నీలో భాగ‌మైన అంద‌రికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

Also Read- Jr NTR: థ్యాంక్స్ శివ.. ఉద్వేగానికి గురైన తారక్



ప్రొడ‌క్ష‌న్ డిజైనర్ సాబు సిరిల్ (Sabu Cyril) మాట్లాడుతూ.. సినిమాను ఇంత గొప్ప‌గా ఆద‌రిస్తున్న ఎన్టీఆర్ అభిమానుల‌కు, సినీ ప్రేమికుల‌కు థాంక్స్‌. ఈ మూవీ మాకెంతో స్పెష‌ల్. అంద‌రం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాం. కొర‌టాల శివ‌ నాపై న‌మ్మ‌కంతో అవ‌కాశం ఇచ్చారు. ర‌త్న‌వేలు నా వ‌ర్క్‌ను త‌న కెమెరాతో ఇంకా గొప్ప‌గా చూపించారు. నాతో పాటు సినిమాకు వ‌ర్క్‌చేసిన టీమ్ స‌భ్యుల‌కు థాంక్స్‌. నిర్మాత‌లు అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా సినిమాను నిర్మించారు. అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో సినిమాను నిర్మించారు. ముఖ్యంగా అండ‌ర్ వాట‌ర్ స‌న్నివేశాల‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుందని తెలిపారు. కాగా, తారక్ ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా తన సంతోషాన్ని తెలియజేసిన విషయం తెలిసిందే.

Also Read- Jani Master Case: షాకింగ్ ట్విస్ట్.. విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే..

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2024 | 08:04 PM