కొరమీనా నిన్ను.. కోసుకుంటా ఇయ్యాలా

ABN, Publish Date - Sep 05 , 2024 | 03:25 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘దేవర 1’ చిత్రం నుంచి మాస్‌ నంబర్‌ను విడుదల చేశారు. ‘కొరమీనా నిన్ను.. కోసుకుంటా ఇయ్యాలా’ అంటూ రామజోగయ్యశాస్త్రి రాసిన పాట వీడియోను విడుదల చేశారు. ఈ పాటలో ఎన్టీఆర్‌ వేసిన స్టెప్పులు ఆడియన్స్‌తో డాన్స్‌ ...

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘దేవర 1’ చిత్రం నుంచి మాస్‌ నంబర్‌ను విడుదల చేశారు. ‘కొరమీనా నిన్ను.. కోసుకుంటా ఇయ్యాలా’ అంటూ రామజోగయ్యశాస్త్రి రాసిన పాట వీడియోను విడుదల చేశారు. ఈ పాటలో ఎన్టీఆర్‌ వేసిన స్టెప్పులు ఆడియన్స్‌తో డాన్స్‌ చేయించేలా ఉన్నాయి. ఎన్టీఆర్‌ డాన్స్‌ ఎలా ఉండాలని అభిమానులు కోరుకుంటారో దాన్ని మించేలా శేఖర్‌ మాస్టర్‌ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. జాన్వీకపూర్‌ గ్లామరె్‌సగా కనిపించారు. ఎన్టీఆర్‌తో పోటీగా స్టెప్స్‌ వేశారు. ‘దేవర’ మీద ఇప్పటివరకూ ఉన్న అంచనాలు ఈ పాటతో నెక్ట్స్‌ లెవల్‌కు చేరాయి. అనిరుధ్‌ అందించిన సంగీతం పాటకు ప్రాణం పోసింది. హై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ‘దేవర’ రెండు భాగాలుగా ప్రేక్షకులను అలరించనుంది.


మొదటి భాగాన్ని ఈ నెల 27న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ నిర్మిస్తున్నారు.

Updated Date - Sep 05 , 2024 | 03:25 AM