మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mamitha Baiju: 'ప్రేమలు' మమిత బైజు గురించి తెలుసుకోండి

ABN, Publish Date - Mar 14 , 2024 | 12:05 PM

'ప్రేమలు' సినిమాలో రీను పాత్రలో అటు మలయాళం, ఇటు తెలుగు ప్రేక్షకులను ఎంతగానే మెప్పించింది మమిత బైజు. దర్శకుడు రాజమౌళి సైతం ఆమె నటనని ప్రశంసించారు. అంతర్జాలంలో ఎవరీ మమిత అని చాలామంది వెతుకుతున్నారు. ఆమె గురించిన కొన్ని వివరాలు

Mamitha Baiju

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 'ప్రేమలు' సినిమా చూసి అందులో నటించిన మమిత బైజు నటనని ప్రశంసించారు. ఆమె నటనని నాగార్జున పక్కన నటించిన 'గీతాంజలి' సినిమాలో గిరిజ, 'ఫిదా' లో చేసిన సాయి పల్లవి ప్రేక్షకులని ఎంతగా అలరించారో ఇప్పుడు 'ప్రేమలు' సినిమాలో మమిత బైజు కూడా అంతలా అలరించారు అని చెప్పారు. (Premalu fame Mamitha Baiju)

'ప్రేమలు' మలయాళంలో చాలా పెద్ద విజయం సాధించింది. విడుదలైన తరువాత ఈ సినిమా రూ.100 కోట్లు కలెక్టు చేసిందని అక్కడ వార్తలు హల్ చల్ చేశాయి. ఈ సినిమాని తెలుగులో రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ హక్కులు తీసుకొని విడుదల చేశారు.

తెలుగులో కూడా ఈ సినిమా విజయం దిశగా దూసుకుపోతోంది. తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమాలోని మాటలు విపరీతంగా నచ్చడంతో పాటు, ఇందులో నటించిన మమిత బైజు విపరీతంగా ఆకర్షించింది. ఆమె రీను అనే పాత్రలో ఒదిగిపోయింది.

'ప్రేమలు' మలయాళం సినిమా అయినా, ఈ సినిమా షూటింగ్ ఎక్కువభాగం హైదరాబాదులో చిత్రీకరించారు. అందుకని తెలుగు ప్రేక్షకులకి ఇది మరింత దగ్గరైంది అని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. ఈ సినిమా విడుదలైన తరువాత రాజమౌళి, ప్రధాన పాత్ర పోషించిన మమితని ప్రశంసించడంతో ఆమె కోసమని అందరూ అంతర్జాలంలో వెతుకులాట ప్రారంభించారు.

ఇంతకీ ఎవరీ మమిత బైజు? అని అడుగుతున్న ప్రేక్షకులకి ఆమె గురించి కొన్ని వివరాలు. మమిత బైజు, మలయాళం నటి. ఆమె పుట్టినరోజు జూన్ 22, 2001, తల్లిదండ్రులు డాక్టర్ బైజు కృష్ణన్, మణి. ఆమె మొదటి సినిమా మలయాళంలో 'సర్వోపరి పలక్కరన్'. 2017లో మొదటి సినిమా చేసినా, 'ఆపరేషన్ జావా' (2021) అనే సినిమాతో ఆమెకి మంచి పేరొచ్చింది.

'ప్రేమలు' ఆమెకి 16వ సినిమా, అయితే అంతకు ముందు ఎక్కువగా ఆమె ప్రధాన పాత్రలో కాకుండా, సపోర్ట్ పాత్రల్లో ఎక్కువగా నటించింది. 2024లో విడుదలైన 'ప్రేమలు' సినిమాతో ఆమె ఒక్కరోజులోనే స్టార్ అయిపొయింది. దర్శకుడు రాజమౌళి 'ప్రేమలు' లో ఆమె నటనని ప్రశంసించడంతో ఎవరీ మమిత బైజు అని ఆమె కోసం వెతుకులాట ప్రారంభించారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే మమిత ఇంకా చదువుకుంటోంది. ఆమె ఇప్పుడు బీఎస్సీ (సైకాలజీ) సెక్రెడ్ హార్ట్ కాలేజ్ లో చదువుతోంది అంటే అందరికీ ఆశ్చర్యంగా వుంది. అంటే చాలా చిన్న వయసులోనే నటిగా సినిమా ఆరంగేట్రం చేసింది మమిత. 'ప్రేమలు' తెలుగు సినిమా విడుదలతో మమిత ఇప్పుడు తెలుగు, మలయాళం ప్రేక్షకులకు కొత్త క్రష్ అయింది.

ఇది కూడా చదవండి

Premalu Movie Review: నవ్వులే నవ్వులు

Updated Date - Mar 14 , 2024 | 12:06 PM