ఆమీర్‌తో కిశోర్‌కుమార్‌ బయోపిక్‌

ABN, Publish Date - Oct 22 , 2024 | 02:17 AM

బాలీవుడ్‌ గాయక సంచలనం కిశోర్‌కుమార్‌ బయోపిక్‌ తీయాలని బాలీవుడ్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌ ఆలోచన. ఈ బయోపిక్‌ తీసే బాధ్యతను దర్శకుడు అనురాగ్‌ బసుకు అప్పగించారు. కిశోర్‌కుమార్‌ పాత్రను...

బాలీవుడ్‌ గాయక సంచలనం కిశోర్‌కుమార్‌ బయోపిక్‌ తీయాలని బాలీవుడ్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌ ఆలోచన. ఈ బయోపిక్‌ తీసే బాధ్యతను దర్శకుడు అనురాగ్‌ బసుకు అప్పగించారు. కిశోర్‌కుమార్‌ పాత్రను ఆమీర్‌ఖాన్‌ పోషిస్తే బాగుంటుందని దర్శకనిర్మాతల ఆలోచన. ఆమీర్‌కు కూడా కిశోర్‌కుమార్‌ అంటే ఎంతో అభిమానం ఉండడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ముఖ్యంగా అనురాగ్‌ ఈ సబ్జెక్ట్‌ను డీల్‌ చేసే విధంగా ఆమీర్‌ను కదిలించింది. ట్రీట్‌మెంట్‌ కొత్తగా ఉండడం కూడా ఆమీర్‌కు నచ్చింది. ఇప్పటికి నాలుగైదు సార్లు ఈ సబ్జెక్ట్‌ విషయమై కలసి చర్చించారు. ఒకేసారి ఐదు చిత్రాల్లో నటించాలని ఆమీర్‌ఖాన్‌ నిర్ణయించుకుని ఆ యా చిత్రాల దర్శకులకు ఓకే చెప్పేశారు. ఇప్పుడు ఆ జాబితాలో కిశోర్‌కుమార్‌ బయోపిక్‌ ఆరో చిత్రమవుతుంది.

Updated Date - Oct 22 , 2024 | 02:18 AM