కిరణ్ సక్సెస్ స్టోరీ నాకు ఇన్‌స్పిరేషన్
ABN, Publish Date - Oct 31 , 2024 | 02:01 AM
హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. ఈ గురువారం థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నాగచైతన్య పాల్గొన్నారు. ‘నేను ఇంట్రోవర్ట్ పర్సన్‌ను...
హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. ఈ గురువారం థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నాగచైతన్య పాల్గొన్నారు. ‘నేను ఇంట్రోవర్ట్ పర్సన్‌ను. కొత్త వాళ్లతో పెద్దగా కలవను. రీసెంట్‌గా కిరణ్ చెన్నైలో కలిశాడు. ఆయనతో మాట్లాడిన కొద్దిసేపటికే చాలా దగ్గరి ఫ్రెండ్‌లా అనిపించాడు. కిరణ్ ఇన్‌స్పైరింగ్ జర్నీకి నేను నంబర్ వన్ ఫ్యాన్‌ను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో మంచి ప్రొటెక్షన్‌తో వచ్చాను. తనకు ఎవరి సపోర్ట్ లేదు. స్వతహాగా ఎదిగాడు. కిరణ్ సక్సెస్ స్టోరీ నాకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది. ఇండస్ట్రీకి వచ్చే ఎంతోమందికి కిరణ్ స్ఫూర్తిగా నిలుస్తారు. ఇలాంటి హీరోలు సక్సెస్ కావాలి. ‘క’ సినిమా ట్రైలర్ చూశాను. తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని నాగ చైతన్య అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘మూవీ ప్రీ రిలీజ్‌కి నాగ చైతన్య వంటి వారు రావడం ఆనందంగా ఉంది.
ఆయన పాజిటివిటీతో మాకు మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. నాకు సినిమానే ప్రాణం. అందుకే ఏ ఉద్యోగం చేసినా మనసు సినిమావైపే లాగేది. అలా ఇండస్ట్రీకి వచ్చాను. సక్సెస్ వచ్చింది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుజిత్, సందీప్, నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి, హీరోయిన్లు నయన్ సారిక, తన్వీరామ్ పాల్గొన్నారు.