Killer Part 1: కిల్లర్ మూవీ పోస్టర్ లాంచ్

ABN, Publish Date - Oct 06 , 2024 | 07:40 PM

పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాలు లో నటించి పాన్ ఇండియా వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ జ్యోతి పూర్వజ్.

పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాలు లో నటించి పాన్ ఇండియా వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ జ్యోతి పూర్వజ్ (jyothy poorvaj). ఆమె ప్రధాన పాత్రలో 'శుక్ర', 'మాటరాని మౌనమిది', 'ఏ మాస్టర్ పీస్' వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" (Killer)అనే  యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనౌన్స్ చేశారు. ఆదివారం 'కిల్లర్' పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ లాంఛ్ చేశారు. 



పవర్ ఫుల్ లేడీ, గన్, చెస్ కాయిన్స్ తో ఆల్ట్రా మోడరన్ గా డిజైన్ చేసిన "కిల్లర్" మూవీ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్. ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది. పూర్వాజ్ "కిల్లర్" చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.

Updated Date - Oct 07 , 2024 | 10:51 AM