Keerthy Suresh : వచ్చే నెలలో నా పెళ్లి

ABN, Publish Date - Nov 30 , 2024 | 05:11 AM

తన స్నేహితుడు ఆంటోనీతో ప్రేమలో ఉన్నాననీ, దాదాపు పదిహేనేళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని ఇటీవల వెల్లడించిన

తన స్నేహితుడు ఆంటోనీతో ప్రేమలో ఉన్నాననీ, దాదాపు పదిహేనేళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని ఇటీవల వెల్లడించిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ తమ పెళ్లి ఎప్పుడనేది మీడియాకు చెప్పేశారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వాదం పొందిన కీర్తి సురేశ్‌ ఆలయం వెలుపలికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. వచ్చే నెలలో తన పెళ్లి గోవాలో జరుగనుందని, అందుకే స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం కీర్తి సురేశ్‌ ‘బేబీ జాన్‌’ హిందీ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతోనే ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వరుణ్‌ ధావన్‌ ఇందులో హీరోగా నటిస్తున్నారు.

తిరుమల (ఆంధ్రజ్యోతి)

Updated Date - Nov 30 , 2024 | 05:11 AM