పదిహేనేళ్ల ప్రేమ
ABN, Publish Date - Nov 28 , 2024 | 06:00 AM
ఇటీవలే కీర్తి సురేశ్ తన చిరకాల స్నేహితుడు, కేరళకు చెందిన వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌ని పెళ్లిచేసుకోబోతున్నారని
ఇటీవలే కీర్తి సురేశ్ తన చిరకాల స్నేహితుడు, కేరళకు చెందిన వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌ని పెళ్లిచేసుకోబోతున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన కీర్తి సురేశ్.. తన రిలేషన్ స్టేటస్‌పై స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు దీపావళీ రోజున ఆంటోనీతో కలసి తీసుకున్న ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఆంటోనీతో నాది 15 ఏళ్ల అనుబంధం. ఇక ముందూ మా ఇద్దరి బంధం ఇలాగే కొనసాగనుంది’’ అని తమ రిలేషన్‌షిప్ గురించి చెప్పారు. ఈ పోస్టు చూసిన పలువురు సినీ ప్రముఖులు కీర్తి సురేశ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. అయితే వీరి వివాహానికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. డిసెంబరు 11న గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో వీరి వివాహం జరగనుందనీ, పెళ్లికి రెండు రోజుల ముందే డిసెంబరు 9న వివాహ వేడుకలు ఆరంభమవుతాయని సమాచారం.