Double Ismart: మార్ ముంత, చోడ్ చింత పాటలో కెసిఆర్ వాయిస్ పెట్టిన పూరి జగన్ !

ABN, Publish Date - Jul 16 , 2024 | 04:48 PM

ఆమధ్య ఒక స్వామిజీ చెప్పిన 'ఐపొయ్' అనే పదం చాలా వైరల్ విషయం తెలిసిందే. ఆ పదాన్ని చాలామంది చాలా రకాలుగా వాడుకున్నారు కూడా. అలాగే ఇప్పుడు పూరి జగన్నాథ్, రామ్ పోతినేని సినిమా 'డబుల్ ఇస్మార్ట్' సినిమా నుండి విడుదల చేసిన పాటలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గొంతు వింటారు. అదేంటో చదవండి...

A still from the film 'Double Ismart' and KCR

దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంతకు ముందు విజయం సాధించిన 'ఇస్మార్ట్ శంకర్' కి సీక్వల్ గా 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ తో రామ్ పోతినేనితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల అవుతోంది. ఛార్మి కౌర్ ఈ సినిమాకి నిర్మాత. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈరోజు ఈ సినిమా నుండి 'మార్ ముంత, చోడ్ చింత..' అనే పాట లిరిక్స్ ని విడుదల చేశారు చిత్ర నిర్వాహకులు. (Telangana former Chief Minister K Chandrasekhar Rao voice in a song from Double iSmart film directed by Puri Jagannath)

కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ పాడారు. ఇది ఒక మాస్ నంబర్ అని చెప్పొచ్చు. రామ్ పోతినేని పక్కన కావ్య థాపర్ ఇందులో నటిస్తోంది, ఆమె సినిమాలో ఎంత గ్లామరస్ గా వుండబోతోంది ఈ పాట చూస్తేనే అర్థం అయిపోతుంది. ఈ పాటలో ఇంకో విశేషం ఏంటంటే ఇందులో ప్రేక్షకులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు (కెసిఆర్) గొంతును కూడా వినవచ్చు. కెసిఆర్ మామూలుగా అతని ప్రెస్ మీట్ లో చెప్పే పదం 'ఏం జెద్దామంటావ్ మరి' అనేవి ఈ పాటలో వినపడతాయి. (One can hear KCR's voice in the song Maar Muntha Chod Chinta from Double iSmart film directed by Puri Jagannath)

ఈమధ్య సామాజిక మాధ్యమం బాగా పెరిగిపోవటంతో చాలామంది వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి. అందులో 'ఐపోయ్' అని ఒక స్వామిజీ చెప్పిన పదం చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే, ఆ పదాన్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా వాడుకున్నారు. ఇప్పుడు అలాగే కెసిఆర్ మామూలుగా అంటూ వుండే 'ఏం జెద్దామంటావ్ మరి' అనే ఊతపదం కూడా ఈపాటలో ప్రేక్షకులు వినొచ్చు. ఈ సినిమాలో ఇంకా సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు.

Updated Date - Jul 16 , 2024 | 04:55 PM