రిమాండ్‌కు కస్తూరి

ABN, Publish Date - Nov 18 , 2024 | 04:02 AM

తమిళ నాడులో నివసిస్తున్న తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరికి ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు 12 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఆమెను పుళల్‌ సెంట్రల్‌ జైలుకు...

తమిళ నాడులో నివసిస్తున్న తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరికి ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు 12 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఆమెను పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ‘అధికార దుర్వినియోగాన్ని ముగింపు పలికి న్యాయాన్ని గెలిపించాల’ని కోర్టు వెలుపల కస్తూరి మీడియాతో అన్నారు. మధురై కోర్టు ముందస్తు బెయిల్‌ నిరాకరించడంతో హైదరాబాద్‌లో తలదాచుకున్న కస్తూరిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకొని తమిళనాడుకు తరలించిన విషయం తెలిసిందే.

Updated Date - Nov 18 , 2024 | 04:02 AM