Karthikeya2 Team: నేషనల్ అవార్డ్ బాధ్యత పెంచింది.. ‘కార్తికేయ3’ ఎలా ఉంటుందంటే?
ABN, Publish Date - Aug 16 , 2024 | 09:02 PM
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎపిక్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కార్తికేయ2’. ఈ చిత్రం తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్స్‌లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం(తెలుగు)గా నేషనల్ అవార్డ్ గెలుచుకుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘కార్తికేయ2’ (Karthikeya 2) చిత్రానికి నేషనల్ అవార్డ్ రావడం మా సంస్థకు మైల్ స్టోన్ మూమెంట్ అని అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad). నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) హీరోగా చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎపిక్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కార్తికేయ2’. ఈ చిత్రం తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్స్‌లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం(తెలుగు)గా నేషనల్ అవార్డ్ (National Award) గెలుచుకుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Also Read- 70th National Film Awards: ఉత్తమ నటులు, నాయికలు, చిత్రాల విజేతలు వీరే
ఈ కార్యక్రమంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ‘కార్తికేయ2’ చిత్రానికి నేషనల్ అవార్డ్ రావడం మా సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మైల్ స్టోన్ మూమెంట్‌గా భావిస్తున్నాం. ఇది మా మొదటి నేషనల్ అవార్డ్. మా అభిషేక్‌కి సెకండ్ నేషనల్ అవార్డ్. ఈ సందర్భంగా నిఖిల్‌కి థాంక్స్ చెబుతున్నాం. నిఖిల్ మాకు డైరెక్టర్ చందూ మొండేటితో పరిచయం చేశారు. ఈ చిత్రాన్ని అభిషేక్, మేము కలిసి చేశాం. ‘కార్తికేయ2’ మొదలుపెట్టినప్పుడే పెద్ద సినిమా అనుకున్నాం. కానీ ఇంత సక్సెస్ వస్తుందని ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులే కాకుండా పాన్ ఇండియా వైజ్ ఆడియన్స్ అద్భుతంగా ఆదరించారు. ఈ రోజు మైల్ స్టోన్ నేషనల్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా వుంది. మా సంస్థకు ఇది చాలా గొప్ప విషయం. ‘కార్తికేయ3’ అంతకుమించి వుంటుందని అన్నారు.
నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. లార్డ్ కృష్ణ ఈజ్ ట్రూత్. ఈ రోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ అవార్డ్ కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా సినిమాలన్నిటికీ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. నిఖిల్, చందూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు, వారితో మా కొలాబరేషన్ కొనసాగుతుందని తెలిపారు. (Karthikeya2 Team Media Meet)
డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ.. ‘కార్తికేయ2’ అద్భుత విజయం సాధించినప్పుడు ఎంత హ్యాపీగా ఫీలయ్యామో.. ఇప్పుడు అదే ఫీలింగ్‌లో వున్నాం. నేషనల్ అవార్డ్ మరింత బాధ్యతని పెంచింది. ‘కార్తికేయ3’ ఖచ్చితంగా వుంటుంది. ప్రస్తుతం రైటింగ్‌లో వుంది. ‘కార్తికేయ2’ తర్వాత దానిపై అంచనాలు ఎంతలా పెరిగాయో మాకు తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ3’ వుంటుంది. నేషనల్ అవార్డ్ రావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. థాంక్ యూ జూరీ మెంబర్స్. జై శ్రీకృష్ణ అని అన్నారు. (Karthikeya3 Update)
Read Latest Cinema News