నాటి మద్రాసు నేపథ్యంలో కాంత

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:42 AM

రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్‌ కలసి నిర్మించే ‘కాంత’ చిత్రం షూటింగ్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దుల్కర్‌ సల్మాన్‌, భాగ్యశ్రీ జంటగా నటించే ఈ సినిమాకు...

రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్‌ కలసి నిర్మించే ‘కాంత’ చిత్రం షూటింగ్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దుల్కర్‌ సల్మాన్‌, భాగ్యశ్రీ జంటగా నటించే ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకుడు. సముద్రఖని కీలక పాత్రధారి. రామానాయుడు స్టూడియోలో తొలి క్లాప్‌ ఇచ్చి ‘కాంత’ చిత్రానికి శ్రీకారం చుట్టారు విక్టరీ వెంకటేశ్‌. 1950 నాటి మద్రాసు బ్యాక్‌డ్రాప్‌లో మానవ భాగోద్వేగాల లోతుల్ని ఆవిష్కరించే ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని దర్శకుడు చెప్పారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ 60వ సంవత్సరం సందర్భంగా స్పిరిట్‌ మీడియా కొత్త శకానికి నాంది పలుకుతూ తీస్తున్న సినిమా ఇదనీ రానా చెప్పారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలయ్యే ఈ సినిమాను ప్రశాంత్‌ పొట్లూరి, రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్‌, జోమ్‌ వర్గీస్‌ నిర్మిస్తున్నారు

Updated Date - Sep 10 , 2024 | 03:42 AM