కన్నప్ప కోసం కంపడు.. గవ్వ రాజు

ABN, Publish Date - Aug 20 , 2024 | 02:35 AM

విష్ణు మంచు నటిస్తూ, ఎంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న నటులకు సంబంధించిన లుక్స్‌ ఒక్కొక్కటి విడుదల చేస్తున్నారు...

విష్ణు మంచు నటిస్తూ, ఎంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న నటులకు సంబంధించిన లుక్స్‌ ఒక్కొక్కటి విడుదల చేస్తున్నారు. ఇందులో కంపడు పాత్ర పోషిస్తున్న ముఖేశ్‌ రిషి, గవ్వరాజు పాత్ర చేసిన బ్రహ్మాజీ లుక్స్‌ సోమవారం రిలీజ్‌ చేశారు. పురాతన పుళింద జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు సంబంధించిన పాత్రలు ఇవి. డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రానికి ముఖేశ్‌కుమార్‌ దర్శకుడు.

Updated Date - Aug 20 , 2024 | 02:35 AM