శ్రీరంగపురంలో కల్యాణం
ABN, Publish Date - Aug 31 , 2024 | 06:15 AM
వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయం మా కుటుంబానికి చాలా ప్రత్యేకం. సిద్థార్థ్‌తో నా నిశ్చితార్థం అక్కడే జరిగింది. త్వరలో మా పెళ్లి కూడా అక్కడే జరుగుతుంది’ అని కథానాయిక అదితీ రావ్
వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయం మా కుటుంబానికి చాలా ప్రత్యేకం. సిద్థార్థ్‌తో నా నిశ్చితార్థం అక్కడే జరిగింది. త్వరలో మా పెళ్లి కూడా అక్కడే జరుగుతుంది’ అని కథానాయిక అదితీ రావ్ హైదరీ చెప్పారు. మార్చిలో వారిద్దరికీ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. తమ ప్రేమ, పెళ్లి గురించి అదితీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పెళ్లి తేదీని పెద్దలు నిర్ణయిస్తారు, మేం ఇద్దరం కలసి ప్రకటిస్తామని చెప్పారు. ‘మహాసముద్రం’ సినిమా చిత్రీకరణ సమయంలో సిద్ధార్థ్, అదితీ ప్రేమలో పడ్డారు.