మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ap CM Oath Ceremony: ఆంధ్రప్రదేశ్‌ చారిత్రక సమయంలో చారిత్రక గీతం

ABN, Publish Date - Jun 12 , 2024 | 11:12 AM

ఆంధ్రప్రదేశ్‌  అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం (TDP-JSP-BJP) దక్కించుకుంది. బుధవారం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 9Ap Cm Chandrababu naidu) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు

ఆంధ్రప్రదేశ్‌  అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం (TDP-JSP-BJP) దక్కించుకుంది. బుధవారం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Ap Cm Chandrababu naidu) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి రంగం మొత్తం సిద్ధమైంది. సభా ప్రాంగణం అభిమానులతో కిక్కిరిసిపోయింది. వేదికపై జానపద గేయాలతో ఆహుతుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు కళాకారులు. ఈ నేపథ్యంలో సినీ గేయ రచయిత త్రిపురనేని కల్యాణచక్రవర్తి  (Kalyan hakravarthy) ఆంధ్ర రాష్ట్ర గత వైభవాన్ని సంస్మరించుకుంటూ (Ap cm Oath ceremony) ఉజ్వలమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ‘‘జయహో ఆంధ్రమాతా - సాహో  నీదుచరిత’’ (Jayaho andhramatha) అంటూ సాగే ఓ పాటను రచించారు. హరిగౌర హృద్యమైన సంగీతం అందించారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో ఆయనకు అంకితమిస్తూ ఈ పాటను బుధవారం విడుదల చేశారు. సినీ నిర్మాత భరత్‌ చౌదరి (Bharath chowdary) ఈ పాటకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ పాటను తెదేపా అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్లు చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. గతంతో మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఇలాంటి ఎన్నో పాటల్ని, యాడ్స్‌ను రూపొందించారు. అవన్నీ కూడా జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.



ఇక చంద్రబాబు ఈ రోజు 11.27 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ రంగ ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. చిరంజీవి మంగళవారం సాయంత్రమే తన భార్య సురేఖతో పాటు మెగా ఫ్యామిలీ అంతా విజయవాడ చేరుకున్నారు. తలైవా రజినీకాంత్ కూడా నిన్ననే విజయవాడకు చేరుకున్నారు. ఇంకా యువ హీరోలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనున్నారు. 

Updated Date - Jun 12 , 2024 | 03:29 PM