లెక్కలు మారిపోవడానికి ఒక్క శుక్రవారం చాలు

ABN, Publish Date - Nov 09 , 2024 | 06:24 AM

‘ఈ సారి దీపావళి బరిలో నిలిచిన సినిమాలు గట్టి పోటీ ఇచ్చినా వాటన్నింటినీ తట్టుకొని ‘క’ సినిమా ఘన విజయాన్ని అందుకొంది. ఈ రోజు ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో పాలు పంచుకొంటున్నందుకు

‘ఈ సారి దీపావళి బరిలో నిలిచిన సినిమాలు గట్టి పోటీ ఇచ్చినా వాటన్నింటినీ తట్టుకొని ‘క’ సినిమా ఘన విజయాన్ని అందుకొంది. ఈ రోజు ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో పాలు పంచుకొంటున్నందుకు ఆనందంగా ఉంది’ అని నిర్మాత దిల్‌ రాజు అన్నాడు. కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ఆదరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం శుక్రవారం సక్సె్‌సమీట్‌ను నిర్వహించింది. కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘పెద్ద సినిమాల మధ్యన మీ సినిమా ఎందుకు అన్నారు. ‘మంచి సినిమా అని మేం చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. కానీ ప్రేక్షకులు సినిమా చూసి పెద్ద విజయాన్ని అందించారు. వారందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఏ హీరోనూ అతని మార్కెట్‌ను బట్టి అంచనా వేయవద్దు. ఆ లెక్కలన్నీ మారిపోవడానికి ఒక్క శుక్రవారం చాలు’ అని స్పందించారు. మంచి సినిమాను చేశామనే సంతృప్తిని ‘క’ మాకు మిగిల్చింది అని నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ‘‘క ’ సినిమా క్లైమాక్స్‌ను నేను ఊహించలేకపోయాను. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్‌ స్ర్కీన్‌ప్లే మూవీ ఇది’ అని నిర్మాత బన్నీవాస్‌ అభినందించారు. నెగెటివ్‌ ప్రచారాన్ని తట్టుకొని ‘క’ లాంటి సూపర్‌హిట్‌ను ఇచ్చిన కిరణ్‌ను అభినందిస్తున్నాను అన్నారు సందీప్‌ కిషన్‌.

Updated Date - Nov 09 , 2024 | 06:24 AM