Devara: 'కోలీవుడ్‌'కు‌కెక్కని 'దేవర'

ABN, Publish Date - Oct 06 , 2024 | 05:56 PM

జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) తాజా చిత్రం దేవర(Devara) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా, హిందీలో డీసెంట్‌గా నడిచింది. కానీ.. తమిళంలో మాత్రం నిరాశపరిచింది.

devara tamil poster

జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) తాజా చిత్రం దేవర(Devara) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా, హిందీలో డీసెంట్‌గా నడిచింది. కానీ.. తమిళంలో మాత్రం నిరాశపరిచింది. దీంతో తమిళనాడులోని ప్రేక్షకులు ఇతర భాషా హీరోల చిత్రాలను ఎక్కువగా ప్రోత్సహించరని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేవర కేవలం 8 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందని తమిళ విశ్లేషకులు తెలిపారు. ఓవర్సీస్‌లో కూడా దేవర తమిళ వెర్షన్ ద్వారా 15 వేల డాలర్లనే మాత్రమే వసూలు చేయగలిగింది. ఎన్టీఆర్ చాలా కష్టపడి ఐదు భాషల్లో తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇప్పటికీ తమిళ ప్రేక్షకులు ఎప్పటిలాగానే తెలుగు హీరోల సినిమాలకి ఆసక్తి చూపించలేదు. అందుకే ఇక నుంచి మన దర్శకనిర్మాతలు దక్షిణాది భాషలన్నింటిలో విడుదల చేయడం కంటే తెలుగు, హిందీ వెర్షన్లపై దృష్టి సారిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.


కాగా కొరటాల శివ సినిమా అంటేనే కమర్షియల్ విత్ సోషల్ మెసేజ్. ‘దేవర’లోనూ ఇదే ట్రై చేశాడు దర్శకుడు. ప్రతీ మనిషికి భయం అనేది కచ్చితంగా ఉండాలని.. అది లేకపోతే కష్టం అనేది ఇందులో శివ చెప్పాలనుకున్న మెసేజ్. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు.. చంపేంత ధైర్యం అవసరం లేదనేది ‘దేవర’ కథ. ఈ సింగిల్ లైన్‌పైనే సినిమా అంతా తీశాడు డైరెక్టర్. అందులో కొన్ని ఎత్తులున్నాయి.. మరికొన్ని పల్లాలు కూడా ఉన్నాయి. సినిమా మొదలవ్వడమే చాలా సీరియస్‌గా మొదలవుతుంది. తొలి 20 నిమిషాల తర్వాత కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదు. ఒక్కసారి తారక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథను చాలా సీరియస్ నోట్‌లోనే తీసికెళ్లాడు దర్శకుడు కొరటాల. సో ఇలాంటి ఫార్ములా తమిళ్ ఆడియెన్స్ కి నచ్చదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Also Read- Aditi Rao Hydari: సిద్ధార్థ్‌ తనని ఎలా ప్రేమలో పడేశాడో.. అదితి చెప్పేసింది


Also Read- Pawan Kalyan: అప్పుడు తిట్టినా కేసు లేదు.. ఇప్పుడు ఒక్కమాటకే పోలీసు కేసు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 06 , 2024 | 05:56 PM