జర్నీ... మరోసారి
ABN, Publish Date - Sep 19 , 2024 | 06:54 AM
శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన అనువాద చిత్రం ‘జర్నీ’ 2011లో విడుదలై సంచలన విజయం సాధించింది. రెండు ప్రేమ కథలను సమాంతరంగా...
శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన అనువాద చిత్రం ‘జర్నీ’ 2011లో విడుదలై సంచలన విజయం సాధించింది. రెండు ప్రేమ కథలను సమాంతరంగా చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకొంది. ఇప్పుడు టాలీవుడ్‌లో రీ రిలీజ్ చిత్రాల ట్రెండ్ ఉంది కనుక సుప్రియ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లక్ష్మి నరసింహా మూవీస్ ఈ మ్యూజికల్ లవ్‌స్టోరీని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. ఈ నెల 21న ‘జర్నీ’ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.