Jinn: ‘జిన్’ మూవీ మొదలైంది.. ఏ జానరో తెలుసా..
ABN, Publish Date - Dec 07 , 2024 | 06:27 PM
కన్నడ, తెలుగు బైలింగ్వల్ మూవీగా తెరకెక్కబోతున్న ‘జిన్’ చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అమిత్ రావ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి రైటర్ వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందిస్తూ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. చిన్మయ్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఏ జానరో తెలుసా..
అమిత్ రావ్ హీరోగా నటిస్తున్న మూవీ ‘జిన్’. ఈ చిత్రాన్ని సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందిస్తూ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. చిన్మయ్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలను పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్రాజ్ వాడి పోషిస్తున్నారు. శనివారం ఈ చిత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కనున్న ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆ తర్వాత రాజ్ కందుకూరి, రామజోగయ్య శాస్త్రి కలిసి స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందచేశారు.
Also Read- Janhvi kapoor: వాళ్లే మన సినిమా చూస్తుంటే మీకేంటి నొప్పి..
ఈ సందర్భంగా లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ఈ చిత్రానికి డైలాగ్స్ రాసిన వరదరాజ్ నాకు మంచి మిత్రుడు. పాన్ ఇండియా చిత్రాలు కన్నడలో రిలీజైతే ఆయనే రైటర్‌గా వర్క్ చేస్తుంటారు. ‘జిన్’ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్‌గా చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా కన్నడ, తెలుగు బైలింగ్వల్ మూవీగా రూపొందిస్తున్నారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని తెలపగా మరో అతిథి నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘జిన్’ టైటిల్ బాగుంది. సస్పెన్ హారర్ థ్రిల్లర్ జానర్స్‌కు పోటీ తక్కువగా ఉంటుంది. మంచి కంటెంట్ ఉంటే ఈ సినిమాలతో సులువుగా ప్రేక్షకులకు రీచ్ కావొచ్చు. వరదరాజ్, అమిత్ రావ్, చిన్మయ్ రామ్‌తో పాటు టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ తెలియజేస్తున్నానని అన్నారు.
డైలాగ్ రైటర్, కో ప్రొడ్యూసర్ వరదరాజ్ చిక్కబళ్లాపుర మాట్లాడుతూ.. మా ‘జిన్’ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి, గురువు లాంటి రామజోగయ్యగార్లకు థ్యాంక్స్. సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ మూవీస్ ఎన్నో చూసి ఉంటాం. కానీ ‘జిన్’ కథ విన్నప్పుడు ఇది కొత్తగా ఉంది అనిపించింది. ఈ సినిమాకు డైలాగ్స్ రాయడంతో పాటు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించాను. అమిత్ రావ్ మంచి పర్ ఫార్మర్. డైరెక్టర్ చిన్మయ్ రామ్ టాలెంటెడ్ టెక్నీషియన్. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తామని చెప్పగా.. ‘జిన్ సినిమాను తెలుగు, కన్నడ బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నాం. వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు నిర్మాత నిఖిల్ ఎమ్ గౌడ.
డైరెక్టర్ చిన్మయ్ రామ్ మాట్లాడుతూ.. ‘జిన్’ సినిమా డైరెక్టర్‌గా నాకు ఫస్ట్ మూవీ. నా స్నేహితుడు పర్వీజ్‌తో కలిసి స్క్రిప్ట్ రెడీ చేశాను. ఇదొక మంచి కథ. స్క్రిప్ట్ పర్పెక్ట్‌గా వచ్చేందుకు చాలా టైమ్ తీసుకున్నాం. ఇక్కడే హైదారాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, నాకు సపోర్ట్ చేస్తున్న టీమ్ అందరికీ థ్యాంక్స్ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు అమ్రిత్ సాగర్, హీరో అమిత్ రావ్ మాట్లాడారు.