సెప్టెంబర్‌లో జిగేల్‌

ABN, Publish Date - Aug 29 , 2024 | 04:14 AM

త్రిగుణ్‌, మేఘనా చౌదరి జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘జిగేల్‌’. మల్లి యేలూరి దర్శకత్వంలో డాక్టర్‌ వై జగన్‌ మోహన్‌, నాగార్జున అల్లం నిర్మిస్తున్నారు...

త్రిగుణ్‌, మేఘనా చౌదరి జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘జిగేల్‌’. మల్లి యేలూరి దర్శకత్వంలో డాక్టర్‌ వై జగన్‌ మోహన్‌, నాగార్జున అల్లం నిర్మిస్తున్నారు. బుధవారం చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘సెప్టెంబర్‌లో ‘జిగేల్‌’ చిత్రాన్ని విడుదల చేస్తాం. యువతను ఆకట్టుకునే కథతో తెరకెక్కుతోంది’ అని నిర్మాతలు చెప్పారు. రఘుబాబు, పృథ్వి కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: ఆనంద్‌ మంత్ర

Updated Date - Aug 29 , 2024 | 04:14 AM