Aghathiyaa: ‘రంగం’ హీరో మంచి సినిమా పట్టాడు.. ఫస్ట్ లుక్ అదిరింది

ABN, Publish Date - Oct 08 , 2024 | 08:19 PM

‘రంగం’ వంటి సినిమాతో హీరోగా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న జీవా.. ఆ తర్వాత సరైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులని మెప్పించలేకపోయారు. చాలా కాలం తర్వాత ఆయన ఓ స్పెక్టాక్యులర్ ఫాంటసీ థ్రిల్లర్‌‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మూవీ వివరాలివే..

Aghathiyaa First Look

బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ వంటి నిర్మాణ సంస్థ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మాత డా. ఇషారి కె. గణేష్ ఇప్పుడు అనీష్ దేవ్ నేతృత్వంలోని WAM ఇండియాస్‌తో కలిసి ఓ పాన్ ఇండియా స్పెక్టాక్యులర్ ఫాంటసీ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు. జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘అఘతియా’ (Aghathiyaa) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. రాశి ఖన్నాతో పాటు యూరోపియన్ నటి మటిల్డా మరియు అమెరికన్ నటుడు ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Trivikram Srinivas: సమంతపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు


ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విషయానికి వస్తే.. లీడ్ యాక్టర్స్, వారి ఇంటెన్స్ ఫేస్‌లతో ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ ఫస్ట్‌లుక్‌తో మునుపెన్నడూ లేని సినిమాటిక్ అనుభూతిని ఈ సినిమా అందిస్తుందనే ఫీల్‌ని ఇస్తుండటం విశేషం. ప్రముఖ హాస్యనటులు యోగి బాబు, VTV గణేష్, మొట్టా రాజేంద్రన్ మరియు రెడిన్ కింగ్స్లీ ఇందులో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ప్రముఖ లిరిక్ రైటర్ పా. విజయ్. దీపక్ కుమార్ పతి సినిమాటోగ్రఫీని, శాన్ లోకేష్ ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. (Aghathiyaa First Look Out)


భారీ స్థాయిలో నిర్మించిన ‘అఘతియా’ ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫాంటసీ థ్రిల్లర్. ఈ పాన్-ఇండియా చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. సినిమా కోర్ థీమ్ జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ మధ్య బాండింగ్ చుట్టూ వుంటుందని.. ఇందులో రాశి ఖన్నా, మటిల్డా నటించిన ఫాంటసీ సన్నివేశాలు రివర్టింగ్ స్క్రీన్‌ప్లేలో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో దాదాపు 90 నిమిషాల పాటు అద్భుతమైన CG విజువల్స్‌ ప్రేక్షకులని మైమరపిస్తున్నాయని, మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళతాయని నిర్మాతలు చెబుతున్నారు.

యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా గురించి దర్శకుడు పా. విజయ్ మాట్లాడుతూ.. ‘అఘతియా’ హ్యూమన్ ఎమోషన్స్‌తో ఫాంటసీని బ్లెండ్ చేసిన డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది మ్యాజిక్ గురించి మాత్రమే కాదు, పాత్రల మధ్య బాండింగ్ గురించి, తెలియని ప్రపంచం గుండా వారి జర్నీని ఆవిష్కరించే అద్భుత చిత్రీకరణ. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందని కచ్చితంగా చెప్పగలనని అన్నారు.

Also Read- Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌కు తలసాని పరామర్శ

Also Read- Nagarjuna: ఆ రోజు ఇండస్ట్రీని పట్టించుకోలేదు.. ఈ రోజు నీ వెంటే ఇండస్ట్రీ.. తేడా తెలిసిందా నాగ్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 08 , 2024 | 08:19 PM