అసూయతో వచ్చిన మాటలవి
ABN, Publish Date - Aug 21 , 2024 | 01:37 AM
ప్రభా్‌సపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలను హీరో సుధీర్‌బాబు, దర్శకుడు అజయ్ భూపతి తప్పుపట్టారు. మంగళవారం సోషల్‌మీడియాలో ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. ‘‘అర్షద్ వార్సీ నుంచి...
ప్రభా్‌సపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలను హీరో సుధీర్‌బాబు, దర్శకుడు అజయ్ భూపతి తప్పుపట్టారు. మంగళవారం సోషల్‌మీడియాలో ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. ‘‘అర్షద్ వార్సీ నుంచి ఇలాంటి ఫ్రొఫెషనలిజం లేని మాటలు రావడం అస్సలు ఊహించలేదు. విమర్శనాత్మకంగా మాట్లాడవచ్చు కానీ ఇలా చులకనగా మాట్లాడ్డం సరికాదు. ఇలాంటి అనవసర వ్యాఖ్యలను పట్టించుకునే తీరిక ప్రభా్‌సకు లేదు. ఆయన స్థాయి చాలా పెద్దది’’ అని ఎక్స్‌లో సుధీర్‌బాబు పేర్కొన్నారు. ‘‘భారతీయ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లడానికి.. తన వంతుగా ఏమైనా చెయ్యడానికి ప్రభాస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆయన మన దేశానికే గర్వకారణం. ఈ మాటలన్నీ వార్సీ నుంచి అసూయతో వచ్చినవే’’ అని దర్శకుడు అజయ్ భూపతి ఎక్స్‌లో పేర్కొన్నారు. కాగా, ఇటీవలే అర్షద్ వార్సీ, ‘కల్కి 2898 ఏ.డీ’ సినిమాలో ప్రభాస్ లుక్ జోకర్‌లా ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.