Jathara: ‘జాతర’ ట్రైలర్.. గూస్ బంప్స్ పక్కా..

ABN, Publish Date - Oct 29 , 2024 | 07:05 PM

గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘జాతర’. సతీష్ బాబు రాటకొండ నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించి.. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా మేకర్స్ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..

Jathara Movie Still

గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘జాతర’ (Jathara). సతీష్ బాబు రాటకొండ (Sathish Babu Ratakonda) నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా చిత్రయూనిట్ థియేట్రికల్ ట్రైలర్‌ని నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్‌గా, ఇంటెన్స్ డ్రామాతో ఈ చిత్రం తెరకెక్కుతోందని.. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే జాతర నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ తెలిపి ఉన్నారు. నవంబర్ 8న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (Jathara Trailer Talk)

Also Read-Allu Arjun: ‘అయాన్‌.. నా గొడ్డలి ఎప్పుడు తీసుకెళ్లావ్‌’ బన్నీ వైరల్‌ పోస్ట్‌

ట్రైలర్‌‌ని విడుదల చేసిన అనంతరం నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుందని, కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్‌ఫుల్ చిత్రంగా నిలుస్తుందని తెలుపుతూ.. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ట్రైలర్ విషయానికి వస్తే.. ‘అమ్మోరు తల్లి ఊరు వదిలి వెళ్లిపోయిందహో’ అంటూ దండోరా వేస్తున్నట్టుగా మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ‘నువ్వు ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకోవడానికి అమ్మోరు నీ ఇంట్లో గొడ్డు అనుకున్నావారా?’, ‘తోలేసుకుని బతికే వాళ్లమే కానీ తోలు అమ్ముకుని బతికే వాళ్లం కాదు’ అనే డైలాగ్స్ ఈ ట్రైలర్ ఇంటెన్సిటీని తెలియజేస్తున్నాయి.


టెక్నికల్‌గా కూడా ఈ ట్రైలర్ హై స్టాండర్డ్స్‌లో ఉంది. విజువల్స్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ హైలెట్ అనేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ట్రైలర్ లాస్ట్ షాట్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ చిత్రంలో దీయా రాజ్ కథానాయికగా నటించగా.. ఆర్.కె. నాయుడు, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్ సహాయక పాత్రల్లో నటించారు. కె.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందించిన ఈ చిత్రానికి శ్రీజిత్ ఎడవణ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ విడుదల చేసిన నిర్మాత రాజ్ కందుకూరికి చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది.

Also Read- Abhirami: అప్పుడలా.. ఇప్పుడిలా.. అభిరామి ఫొటోలు వైరల్‌

Also Read-Star Heroine: ఈ ఫొటోలోని పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టండి చూద్దాం!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 29 , 2024 | 07:05 PM