మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RC16: అఫీషియల్.. రామ్ చరణ్ సినిమాలో జాన్వీకపూర్

ABN, Publish Date - Mar 06 , 2024 | 09:55 AM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి పాన్ ఇండియా చిత్రం RC16 కోసం ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన యంగ్ టాలెంటెడ్ దర్శకుడు బుచ్చి బాబు సానాతో జతకట్టబోతోన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌, భారీ స్థాయిలో వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు.

Ram Charan and Janhvi Kapoor

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) తన తదుపరి పాన్ ఇండియా (Pan India) చిత్రం RC16 కోసం ‘ఉప్పెన’ (Uppena)తో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన యంగ్ టాలెంటెడ్ దర్శకుడు బుచ్చి బాబు సానా (Buchi Babu Sana)తో జతకట్టబోతోన్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ (Vriddhi Cinemas), సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌, భారీ స్థాయిలో వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించే హీరోయిన్ విషయంలో గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఫైనల్‌గా ఈ సినిమాలో హీరోయిన్‌ని మేకర్స్ ఫిక్స్ చేశారు. అతిలోకసుందరి, దివంగత నటి శ్రీదేవి (Sridevi) తనయ జాన్వీకపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్సయింది. ఈ విషయాన్ని మేకర్స్ జాన్వీ కపూర్ పుట్టినరోజును పురస్కరించుకుని అధికారికంగా తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. (HBDJanhviKapoor)


ఈ పోస్టర్‌లో జాన్వీ నిండైన చీర కట్టులో దర్శనమిస్తున్నారు. ఈ అధికారిక ప్రకటనతో.. ఆర్‌సి16 (RC16) హీరోయిన్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. అద్భుతమైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రానికి ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో డైలాగ్‌లను అనర్గళంగా చెప్పగల నటీనటుల అన్వేషణను ఇటీవల యూనిట్ జరిపింది. ప్రముఖ తారాగణం నటించనున్న ఈ సినిమా కోసం బుచ్చిబాబు యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Nivetha Pethuraj: సీఎం కొడుకు రూ. 50 కోట్ల గిఫ్ట్‌ ఇచ్చాడనే వార్తలపై నివేతా సీరియస్..

****************************

*Save The Tigers 2: ‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

***************************

Updated Date - Mar 06 , 2024 | 10:29 AM