లొకేషన్ల వేటలో జక్కన్న

ABN, Publish Date - Oct 30 , 2024 | 05:46 AM

మహేశ్‌బాబు-రాజమౌళి కలయికలో పాన్‌ ఇండియా చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ఎస్‌ఎ్‌సఎంబీ 29 ’అనేది ప్రచారంలో ఉన్న వర్కింగ్‌ టైటిల్‌. మహేశ్‌బాబు ఇప్పటికే ఈ సినిమా కోసం కొత్తలుక్‌తో సిద్ధమయ్యారు...

మహేశ్‌బాబు-రాజమౌళి కలయికలో పాన్‌ ఇండియా చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ఎస్‌ఎ్‌సఎంబీ 29 ’అనేది ప్రచారంలో ఉన్న వర్కింగ్‌ టైటిల్‌. మహేశ్‌బాబు ఇప్పటికే ఈ సినిమా కోసం కొత్తలుక్‌తో సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంతో సాగుతున్నాయని రాజమౌళి చెప్పకనే చెప్పారు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసిన రాజమౌళి లొకేషన్ల వేటలో పడ్డారు. మంగళవారం ఆయన సోషల్‌ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్‌ చేసి ‘వెతుకుతున్నాను’ అని తెలిపారు. ఆ ఫొటోలో కెన్యాలోని అటవీ ప్రాంతంలో జంతువుల మధ్య తిరుగుతూ రాజమౌళి కనిపించారు. అటవీ నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచర్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకకెక్కబోతోందని రాజమౌళి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన కెన్యాలోని అడవుల్లో చిత్రీకరణకు అనువైన ప్రదేశాలను వెతికే పనిలో ఉన్నారని తెలుస్తోంది. లొకేషన్లు ఖరారు అయితే సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం. కొత్త ఏడాదిలో చిత్రీకరణ ప్రారంభమవనుంది.

Updated Date - Oct 30 , 2024 | 08:39 AM