Jagapatibabu: సిగ్గు.. శరం లేదంటూ పోస్ట్
ABN, Publish Date - Jul 18 , 2024 | 04:53 PM
విలక్షణ నటుడు జగపతిబాబు(Jagapatibabu) తన రూట్ మార్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. విలన్ గానే కాకుండా తండ్రిగా, అన్నగా విభిన్న పాత్రలు పోషిస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ మంచి గుర్తింపు పొందారు.
విలక్షణ నటుడు జగపతిబాబు(Jagapatibabu) తన రూట్ మార్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. విలన్ గానే కాకుండా తండ్రిగా, అన్నగా విభిన్న పాత్రలు పోషిస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ మంచి గుర్తింపు పొందారు. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా టచ్‌లో ఉంటూ ఆయనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఈ ట్వీట్ లో ఆయన గురించి ఆయనే సిగ్గు, శరం అంటూ ఓ పోస్ట్ ని రాసుకొచ్చాడు.
విషయంలోకి వెళ్తే జగపతిబాబు ఓ క్యాసినో కు వెళ్లి అక్కడ దిగిన ఫోటోని పంచుకుంటూ.. ఆ పోస్టులో నాకు సిగ్గు, శరం లేదని దిగులుపడను. కానీ., మీరు చెబితే పడతాను అంటూ రాసుకొచ్చాడు. ఆయన ఫోటోను చూేస్త మాత్రం ఖచ్చితంగా క్యాసినోలో గేమ్ ఆడినట్లుగా అనిపిస్తోంది. అయితే జగతిబాబు ఆ ఫోటో పెడుతూ అలాంటి కామెంట్ ఎందుకు పెట్టాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆ ఫోటో, ఆ కామెంట్ మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. గతంలో ఆయన క్యాసినో వల్ల చాలా పోగొట్టుకున్న సంగతి తెలిసిందే!