Kalinga: ధృవ వాయు ‘కళింగ’ టీజర్‌ వదిలిన బాలీవుడ్ స్టార్ యాక్టర్

ABN, Publish Date - Aug 06 , 2024 | 12:51 AM

‘కిరోసిన్’ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు.. మరోసారి సరికొత్త కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘కళింగ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం కూడా వహించడం విశేషం. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి స్పందను రాబట్టుకోగా.. తాజాగా ఈ సినిమా టీజర్‌ను బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Kalinga Teaser Launch Event

‘కిరోసిన్’ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు (Dhruva Vaayu).. మరోసారి సరికొత్త కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘కళింగ’ (Kalinga)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం కూడా వహించడం విశేషం. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి స్పందను రాబట్టుకోగా.. తాజాగా ఈ సినిమా టీజర్‌ను బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్ (Jackie Shroff) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ.. టీజర్ అద్భుతంగా ఉందని, కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించి మంచి సక్సెస్ సాధిస్తుందని చెబుతూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. (Kalinga Teaser Out)

Also Read- Vikram: మాలాంటి వాళ్ళకి పవన్ కల్యాణ్ ఒక హోప్ ఇచ్చారు


టీజర్ విషయానికి వస్తే.. ఈ టీజర్ ప్రారంభంలోనే ఒక అమ్మాయి తన చెవిని తానే కోసుకుని తినే సీన్ ఒళ్లు గగుర్పొడిచేలా తెరకెక్కించారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ ‘కళింగ’ తెరకెక్కినట్లుగా ఈ టీజర్ తెలియజేస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా, గ్రిప్పింగ్ కథనంతో అందరినీ మెప్పించేలా ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. ఈ సినిమాలో అన్ని రకాల అంశాలను జోడించినట్లుగా టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను చూపించేలా కట్ చేసిన టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచుతూ.. సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఇది ప్రేక్షకులను భయపెట్టేలా ఉందని మాత్రం చెప్పొచ్చు. సంస్థానం అనేది పెద్ద పద్మవ్యూహం.. అక్కడికి పోవడమే కానీ తిరిగి రావడం ఉండదు.. అనే డైలాగ్స్.. ధృవ వాయు యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్.. విజువల్స్, ఆర్ఆర్ ఈ టీజర్లో ప్రత్యేకంగా హైలెట్ అవుతున్నాయి.


ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ (Pragya Nayan) కథానాయికగా నటిస్తుండగా, ‘ఆడుకాలం’ నరేన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్షయ్ రామ్ పొడిశెట్టి సినిమాటోగ్రఫీ.. విష్ణు శేఖర, అనంత నారాయణన్ AG సంగీతం ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఇంకా ఈ చిత్రంలో లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి, షిజు ఏఆర్, మురళీధర్ గౌడ్, సమ్మెట గాంధీ, ప్రీతి సుందర్ కుమార్, బలగం సుధాకర్, ప్రార్ధిని, సంజయ్ కృష్ణ, హరిశ్చంద్ర వంటివారు ఇతర పాత్రలలో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 30 , 2024 | 11:53 AM