ఏడాదిగా ఎదురు చూశా

ABN, Publish Date - Dec 17 , 2024 | 05:55 AM

డా. హరిత గోగినేని దర్శకత్వంలో వేదిక లీడ్‌రోల్‌లో నటించిన చిత్రం ‘ఫియర్‌’. డా.వంకి పెంచలయ్య, ఏఆర్‌ అభి నిర్మాతలు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్‌. ఈనెల 14న రిలీజైన సినిమా...

డా. హరిత గోగినేని దర్శకత్వంలో వేదిక లీడ్‌రోల్‌లో నటించిన చిత్రం ‘ఫియర్‌’. డా.వంకి పెంచలయ్య, ఏఆర్‌ అభి నిర్మాతలు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్‌. ఈనెల 14న రిలీజైన సినిమా ప్రేక్షకాదరణను పొందుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో చిత్ర దర్శకురాలు హరిత గోగినేని మాట్లాడుతూ ‘ఈ రోజు కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నాను. ఇది సైకలాజికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ. చాలా మంది హారర్‌అనుకుంటున్నారు. కాదు కానీ హారర్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. 39 ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో 70కి పైగా అవార్డులు వచ్చాయి. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని అన్నారు.

Updated Date - Dec 17 , 2024 | 05:55 AM