It’s Okay Guru: ‘ఇట్స్ ఓకే గురు’ ఫస్ట్ లుక్ చూశారా..

ABN, Publish Date - Nov 28 , 2024 | 09:05 PM

యూత్ కోసం ఓ వినూత్న కథతో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఇట్స్ ఓకే గురు’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని తాజాగా మేకర్స్ వదిలారు. ఆ వివరాల్లోకి వెళితే..

Its Okay Guru Movie Team with KL Damodar Prasad

చరణ్ సాయి, ఉషశ్రీ జంటగా హీరోహీరోయిన్లుగా.. సుధాకర్ కోమాకుల కీలక పాత్రలో నటించిన విభిన్న కథాచిత్రం ‘ఇట్స్ ఓకే గురు’. మణికంఠ దర్శకత్వంలో వండర్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సురేష్ అనపురపు - బస్వా గోవర్ధన్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పనులు ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. యూనీక్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Geethanjali: ‘గీతాంజలి’ గిరిజ ఇప్పుడెలా ఉందో చూశారా..


ప్రముఖ నిర్మాత - నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా ‘ఇట్స్ ఓకే గురు’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ విడుదల అనంతరం కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పోస్టర్స్, కొన్ని విజువల్స్ చూశాక.. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని అనిపిస్తోందని తెలిపారు.


ఉత్తమాభిరుచి గల నిర్మాత అయిన దామోదర్ ప్రసాద్ ఇచ్చిన కితాబు... తమ చిత్రంపై తమకు గల నమ్మకాన్ని రెట్టింపు చేసిందని నిర్మాత సురేష్ అనపురపు ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని, ముందు ముందు మరింతగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులలోకి తీసుకెళ్లేందుకు ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హీరో చరణ్ సాయి, హీరోయిన్ ఉష శ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమానియాక్, నిర్మాత సురేష్ సురేష్ అనపురాపు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ పాల్గొన్నారు. ఉమా మహేశ్వరరావు, బాల లత, విక్రమ్ మహదేవ్, సూరజ్ కృష్ణ, టింకు సాయినాధ్, దివ్య దీపిక బెల్లంకొండ, తేజ్ దీప్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి మోహిత్ రెహమానియాక్ సంగీతం అందిస్తున్నారు.

Also Read-సిద్ధార్ద్, అదితి రావ్ హైదరి మళ్లీ పెళ్లి.. ఇదేం ట్విస్ట్! ఫొటోలు వైరల్

Also Read-Akkineni Family: ఒకవైపు నాగచైతన్య పెళ్లి.. మరో వైపు అఖిల్ నిశ్చితార్థం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 28 , 2024 | 09:05 PM